నియోజకవర్గం : అసెంబ్లీ

మధిర

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
200026
పురుషులు :
98479
స్త్రీలు :
101538
ప్రస్తుత ఎమ్మెల్యే :
మల్లు భట్టి విక్రమార్క
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు : 200026
పురుషులు :98479
స్త్రీలు :101538
ఇతరులు :9

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ లింగాల కమల్ రాజ్ టీఆర్‌ఎస్ 3567
2009 మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ లింగాల కమలరాజు సీపీఎం 1470
2004 కట్టా వెంకటనర్సయ్య సీపీఎం కొండబాల కోటేశ్వరరావు టీడీపీ 21433
1999 కొండబాల కోటేశ్వరరావు టీడీపీ కట్టా వెంకటనర్సయ్య సీపీఎం 5001
1998 కట్టా వెంకటనర్సయ్య సీపీఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్‌ 4020
1994 బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్‌ 9161
1989 బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్‌ 7022
1985 బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్‌ 9068
1983 శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్‌ బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం 11187
1978 బండారు ప్రసాదరావు కాంగ్రెస్‌(ఐ) ఎం.నర్సింహారావు జనతాపార్టీ 6252
1972 దుగ్గినేని వెంకట్రావమ్మ కాంగ్రెస్‌ బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం 17342
1967 దుగ్గినేని వెంకయ్య కాంగ్రెస్‌ బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం 10404
1962 దుగ్గినేని వెంకయ్య కాంగ్రెస్‌ ఆర్‌.శంకర్రావ్‌ ఇండిపెండెంట్ 5456
1957 బి.సత్యనారాయణరావు కాంగ్రెస్‌ ఎస్‌పీ.రావు పీడీఎఫ్‌ 2603
1952 కె.వెంకయ్య పీడీఎఫ్‌ ఎం.రామచంద్రరావు కాంగ్రెస్‌ 0

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

డాక్టర్‌ కోట రాంబాబు
గత నాలుగు సంవత్సరాలుగా మధిరలో వైద్యసేవలందిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగుతున్నారు.
పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌
కళాకారునిగా పలు జానపద, పౌరాణిక పాత్రలను నటించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కళాకారులకు అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లోనూ ప్రవేశించి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా, రాష్ట్ర కోళ్లు, మాంసం అభివృద్ది సంస్థ చైర్మన్‌గా, పోలీస్‌ గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో పలు పదవులు నిర్వహించి ప్రస్తుతం కళారంగంపై దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌లో చేరినా కళాకారునిగానే కొనసాగుతున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

జాలిముడి ప్రాజెక్టు: మధిర, ఎర్రుపాలెం, బోనకాలు మండలాలకు తాగు, సాగు నీరందించేందుకు ఉద్దేశించి జాలిముడి వద్ద వైరా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ఏడాది సాగు నీరందించనుంది. ప్రస్తుతం మధిర, బోనకాలు మండలాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

మధిర చెరువు వద్ద ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

దీర్ఘకాలిక సమస్యలు
రైల్వే ట్రాక్‌పై లోలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం దశాబ్ధకాలంగా పెండింగ్‌లో ఉంది.
పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి
మడుపల్లిలో లెదర్‌పార్కు ఏర్పాటు
 
 ప్రస్తుతం ఉన్న సమస్యలు
మడుపల్లి-మధిర మధ్య కాజ్‌వే కమ్‌ చెక్‌డ్యాం నిర్మాణం
పట్టణంలో అస్తవ్యస్థంగా డ్రెయినేజీ సమస్య
పరిష్కారానికి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ముఖ్య ప్రాంతాలు

ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం

ఇతర ముఖ్యాంశాలు

మొదటి నుంచి కాంగ్రెస్‌, వామపక్షాలు, టీడీపీ బలంగా ఉన్నాయి. మిత్రపక్షాలు కలిస్తే కాంగ్రెస్‌ ఓటమి చెందుతుంది. త్రిముఖ పోటీలోనే కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తోంది. మారుతున్న రాజకీయాల్లో భాగంగా టీడీపీ కేడర్‌ అంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లటంతో టీఆర్‌ఎస్‌ కొంతమేర బలపడింది.
 
ప్రస్తుతం వామపక్షాలు బలహీనపడగా టీఆర్‌ఎస్‌ బలపడుతూ వస్తోంది. కాంగ్రెస్‌కు బలమున్నా గత ఐదు సంవత్సరాలుగా భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఈ ఐదు సంవత్సరాల్లో భట్టి చేసిన అభివృద్ధి చెప్పుకోదగిన స్థాయిలో లేదు

వీడియోస్

ADVT