పేరు : కోదండరాం
పుట్టిన తేదీ : 5 సెప్టెంబర్ 1955
పుట్టిన స్థలం : మంచిర్యాల
తల్లిదండ్రులు : జనార్దన్ రెడ్డి, వెంకటమ్మ
భార్య : సుశీల
పిల్లలు : ఒక కుమారుడు, ఒక కుమార్తె
రాజ‌కీయ ప్ర‌స్థానం >
ప్రొఫెసర్ కోదండరాం రాజకీయాలను బాగా చదివినవారు. ఆయన జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సంస్థలను స్థాపించారు. అంతేకాకుండా వివిధ సంస్థలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ(ఏపీసీఎల్‌సీ), హ్యూమన్ రైట్స్ ఫోరమ్(హెచ్‌.ఆర్.ఎఫ్), సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్ల్యూఎస్), వరల్డ్ సోషల్ ఫోరమ్, తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. ఆహార భద్రత సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు కమిషనర్‌కు సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి పోరాడారు. రాజకీయ పార్టలను, ఉద్యోగ సంఘాలను ఏకథాటి పైకి తీసుకొచ్చే క్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ) 2009 డిసెంబర్‌లో స్థాపించడంతో దానికి కన్వీనర్‌గా కోదండరామే నియమితులయ్యారు.
 
తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్ర పోషించిన సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె, సాగర హారం, చల్‌మైనో హైదరాబాద్ వంటి రాజకీయ మీటింగ్‌లు విజయవంతం అయ్యయంటే అది టీజేఏసీ పోషించిన పాత్ర వలనే అని చెప్పాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, వెనువెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగిపోయాయి. అయితే తాము అనుకున్నట్టుగా బంగారు తెలంగాణ రాలేదని, ఆంధ్ర పాలకులు తెలంగాణకు ద్రోహం చేసిన మాదిరిగానే కేసీఆర్ కూడా చేస్తున్నారని విమర్శిస్తూ తెలంగాణ జనసమితి పేరిట 2018 మార్చిలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. కేసీఆర్‌ను గద్దె దింపే వరకు పోరాడతామని ఆయన పలు మార్లు ప్రకటించారు. అయితే రాజకీయంగా టీఆర్‌ఎస్‌ను ఆయన ఎదుర్కోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండదనే చెప్పాలి.
వ్యక్తిగత సమాచారం >
కోదండరాంది ఆదిలాబాద్‌. తండ్రి ఫారెస్టు కాంట్రాక్టులు చేసేవారు. అదిలాబాద్ జిల్లాలో జన్మించినప్పటికీ ఆయన వరంగల్ జిల్లాలోనే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమాలలో కోదండరాం పాల్గొనేవారు. 1969లో వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరాటంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. తొలి దశలో సంప్రదాయ ఆలోచనలతో ఉండేవారు. 1970ల నాటి కల్లోల దశాబ్దం ఆయనను ఆలోచింపజేసింది. 1972-75 మధ్యకాలంలో ఆయన డిగ్రీలో ఉండగా..ఇందిరాగాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ పెట్టారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనుకున్న దేశంలో..ఎమర్జెన్సీ విధించడం ఏమిటని దిగ్ర్భాంతికి గురయ్యారాయన. ఈ క్రమంలో పౌర హక్కుల ఉద్యమానికి ఆకర్షితుడినయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్‌లో ఎమ్.ఏ చేయడానికి 1976లో ఆయన మొదటిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఎమ్.ఏ పూర్తిచేసిన తరువాత పొలిటికల్ సైన్స్‌లోనే ఎమ్‌.ఫిల్ చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చి యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా, ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. పొలిటికల్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన ఉస్మానియా నుంచి ప్రొఫెసర్‌గానే పదవీ విరమణ చేశారు. ఆయన పిల్లలిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. అమ్మాయి..నల్లగొండ అబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకుంది.
ఆసక్తికర విషయాలు >
  • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధి.. అంటూ ఉద్యమ సమయంలో కోదండరాంను కేసీఆర్ పొగిడారు. ఇప్పుడు అదే కేసీఆర్ ‘కనీసం సర్పంచ్‌గా కూడా గెలవని వ్యక్తి’.. అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలో కలిసి మెలిగిన వీరిద్దరికీ.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం, టీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక ఏ కారణం వల్లనో విబేధాలు వచ్చాయి. 
  • సామాన్య జనంలో ఇట్టే కలిసిపోతారు. ఉద్యమ సమయంలో ఎక్కడికెళ్లినా కోదండరాంకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇళ్లల్లోకి పిలిచి బోజనాలు పెట్టారు. 
  • ఎంపీ సీటు ఇస్తా పోటీ చేయమని కేసీఆర్ ఆఫరిచ్చినా తిరస్కరించానని కోదండరాం చెబుతుంటారు. 
  • పాత సినిమాలు చూస్తాను. రిలీఫ్‌ కోసం టీవీ చూస్తాను. పుస్తకాలు చదువుతాను. మొక్కలు పెంచడం ఇష్టం

వీడియోస్

ADVT