పుట్టిన తేదీ : 03–06-1971
పుట్టిన స్థలం : సిద్దిపేట
తల్లిదండ్రులు : లక్ష్మి , సత్యనారాయణరావు
భార్య : శ్రీనిత
పిల్లలు : అర్చిశ్‌మాన్, వైష్ణవి
విద్యార్హతలు : బీఏ
బంధువులు : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేనల్లుడు
రాజ‌కీయ ప్ర‌స్థానం >
హరీశ్ రావు తాను చదువుకునే రోజుల్లోనే తన మేనమామ, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన సిద్దిపేట ప్రజల అవసరాలను చూస్తుండేవారు. ఎవరైనా అవసరార్థం వస్తే వారి సమస్యలను తీర్చేవారు. కేసీఆర్ తన రాజకీయ వ్యవహారాల్లో బిజీ బిజీగా ఉంటే, నియోజక వర్గ ప్రజల సమస్యలు తీరుస్తూ ఆ లోటును హరీశ్ భర్తీ చేసేవారు. అలా.. మేనమామ చాటున ఉండి వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తిగా ఉన్న హరీశ్.. 2004 లో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 లో కేసీఆర్ అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సిద్దిపేట శాసనసభతో పాటు కరీంనగర్ లోకసభ స్థానానికి కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ కేసీఆర్ గెలుపొందారు. కానీ కరీంనగర్ ఎంపీగా కొనసాగడం వైపే కేసీఆర్ మొగ్గుచూపారు. దీంతో సిద్దిపేట నియోజకవర్గ శాసనసభా సభ్యత్వానికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజకీయ ప్రస్థానానికి పెట్టని కోటలా ఉన్న సిద్దిపేటలో తనకు నమ్మకస్థుడైన వ్యక్తిని ఎమ్మెల్యేగా బరిలో నిలపాలని కేసీఆర్ భావించారు. అప్పటికే తెర వెనుక నుంచి నియోజకవర్గ బాధ్యతలను చూస్తూ సిద్దిపేట ప్రజల తలలో నాలుకలా ఉన్న హరీశ్ రావుని ఆ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కేసీఆర్ బరిలో దింపారు. దీంతో హరీశ్ తన 32 వ యేటనే సిద్దిపేట శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ ఉప ఎన్నికలతో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ఏమాత్రం ఒడిదుడుకులు లేకుండా నిరాటంకంగా, సమర్థవంతంగా కొనసాగుతూనే వస్తోంది.
 
2008 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తన కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పటికీ, అందుకు తగ్గ వ్యవహారాల్లో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ హరీశ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సిద్దిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 డిసెంబర్ 9 న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించి, మళ్లీ వెనక్కి తగ్గడంలో దీనికి నిరసనగా టీఆర్ ఎస్ శాసనసభ్యులందరూ రాజీనామాలు చేశారు. ఆ కోవలనే హరీశ్ రావు కూడా రాజీనామ చేశారు. మరలా జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచే పోటీచేసి రికార్డు స్థాయిలో 95,858 ఓట్లు సాధించారు.  2009 లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును హరీశ్ అధిగమించారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ సమయంలో కేసీఆర్ వెనకుండి, ఆయన ఆలోచనలను ఏమాత్రం పొల్లుపోకుండా ఉద్యమ క్షేత్రంలో అమలు చేసిన వ్యక్తి హరీశ్ రావు. 2014 లో తెలంగాణ ప్రకటించిన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో హరీశ్ సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి అయిన తాడూరి శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్) పై 93354 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కేసీఆర్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రిగా హరీశ్ రావు బాధ్యతలు నిర్వహించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ శాసనసభ ఎన్నికల్లోనూ ఏ ఒక్కరూ గెలుచుకోని మెజారిటీని హరీష్ సాధించి చరిత్ర సృష్టించారు. కూటమిలో భాగంగా టీజేఎస్ నుంచి పోటీ చేసిన భవానీ రెడ్డిపై ఆయన లక్షా 18 వేల 699 ఓట్ల మెజారిటీని సాధించి చరిత్రలో నిలిచారు. ఇంత వరకు తెలంగాణలో లక్ష మెజారిటీ దాటిన వారు కేవలం ముగ్గురే. అయితే హరీష్ రావు మెజారిటీని మరో నాయకుడు అధిగమించగలడా అన్నది వేచి చూడాలి. 
వ్యాపారాలు, ఆస్తులు >
హరీష్‌రావు ఆస్తి: రూ.3.14కోట్లు
హరీష్‌రావు, ఆయన భార్య శ్రీనిత పేరిట సుమారు రూ.3.14కోట్ల రూపాయల విలువ గల ఆస్తులున్నట్లు ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారికి  దాఖలు చేసిన అపిడవిట్‌లో పేర్కొన్నారు. హరీష్‌రావు పేరిట నగదు రూ.18లక్షలు, భార్య శ్రీనిత వద్ద రూ.8లక్షల నగదు ఉన్నట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎస్‌బీహెచ్‌ బ్రాంచ్‌ సేవింగ్స్‌ ఖాతాలో రూ.17,21,637లు, హైదరాబాద్‌ అసెంబ్లీ బ్రాంచ్‌ ఎస్‌బీహెచ్‌లో రూ.1,67,978లు, ఎల్‌ఐసీ ప్రీమీయం రూ.25,272లు, ఫర్మ్‌లు, కంపనీలు, ట్రస్టులలో రూ.37లక్షలు, ఇన్నోవా కారు విలువ రూ.16,65,832 ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆయన భార్య శ్రీనిఖిత పేరిట జూబ్లి హిల్స్‌ హెడిఎఫ్‌సీ బ్యాంకులో రూ.3,82,648లు, బంజారా హిల్స్‌ ఎస్‌బీ ఖాతాలో రూ.7,46,189లు, జూబ్లి హిల్స్‌ ఎస్‌బీహెచ్‌ ఖాతాలో రూ.11,005లు, నల్లకుంట రుచి చిట్‌ఫండ్స్‌లో రూ.5,10,474లు, వైష్ణవి ఫ్యాషన్స్‌ యజమానిగా పెట్టుబడి రూ.1,18,52,777లు, ఐసీఐసీఐ ప్రీమియం రూ.3204లు, ఎల్‌ఐసీ ప్రీమియంగా రూ. 16,592లున్నట్లు వెల్లడించారు. రూ.17.56లక్షల విలువ గల 520గ్రాముల బంగారు నగలు, కిలోనర వెండి సామాగ్రి ఉన్నట్లు చూపించారు.
 
భూముల వివరాలు: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి వద్ద సర్వే నెంబర్‌ 178,196లలో సుమారు రూ.15ల క్షల విలువ గల 17.03 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తట్టికుంట సర్వేనెంబర్‌ 32లో రూ.12లక్షల విలువ గల 8.264 గుంటల భూమి, సిద్దిపేట భారత్‌నగర్‌లో రూ.18ల క్షల విలువ గల 200 చదరపు గజాల ఇల్లు ఉన ్నట్లుగా హరీశ్‌రావు చూపించారు. తన పేరిట సిద్దిపేట ఎస్‌బీహెచ్‌లో రూ.1,00,643ల ఇంటి రుణం, భార్య శ్రీనిత పేరిట బంజారాహిల్స్‌ హెడిఎఫ్‌సీలో రూ.21,25,670లు వ్యాపార రుణం ఉన్నట్లుగా పేర్కొన్నారు. కుమారుడు ఆర్చిస్‌మాన్‌, కుమార్తె వైష్ణవిల పేరిట ఎలాంటి ఆస్తులు లేవని చూపించారు.
ఆసక్తికర విషయాలు >
మామ కేసీఆర్ మాటను శిరసా వహిస్తారు. కేటీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆయన గీసిన గీతను దాటనని.. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో తేల్చిచెప్పేశారు. కేసీఆర్ లేనిదే తాను లేననీ, కేటీఆర్‌తో విబేధాలు అస్సలు లేవని హరీష్ స్పష్టం చేశారు. 

వీడియోస్

ADVT