పుట్టిన తేదీ : 08/11/1969
పుట్టిన స్థలం : గ్రామం, కొండారెడ్డిపల్లి, మండలం , వంగూరు, జిల్లా మహబూబ్‌నగర్
తల్లిదండ్రులు : నర్సింహ్మారెడ్డి, రాంచంద్రమ్మ
భార్య : గీతా
పిల్లలు : నైనిచ
విద్యార్హతలు : బీఏ, ఎల్‌ఎల్‌బీ
బంధువులు : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అల్లుడిగా, మాజీ మంత్రులు జానారెడ్డి, సబితాఇంద్రారెడ్డి కుమారులతో స్నేహితులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. సోదరుడు తిరుపతిరెడ్డి, ఎమ్మెల్యేతో చేదోడు వాదోడుగా అన్ని కార్యక్రమాలు చూసుకుంటాడు.
రాజ‌కీయ ప్ర‌స్థానం >
తనదైన శైలిలో అంచలంచలుగా పదవులు పొందుతూ రాష్ట్ర నాయకుడిగా పేరు పొందుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున రాజకీయ రంగప్రవేశం చేసిన రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా బెడ్జిట్‌ జడ్పీటీసీగా గెలుపొందారు. తరువాత స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచి అన్ని పార్టీలను కూడగట్టి ఊహించని రీతిలో గెలుపును దక్కించుకున్నారు. తదనంతరం అదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆహ్వానాన్ని కాదని.. తెలుగుదేశం పార్టీలో చేరారు. 2008లో కొడంగల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో రంగప్రవేశం చేసిన రేవంత్‌రెడ్డి ప్రత్యర్థి అభ్యర్థి గురునాథ్‌రెడ్డిపై విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడిగా వెలుగొంది తిరిగి 2014 ఎన్నికల్లో గురునాథ్‌రెడ్డిపై 7516 ఓట్ల మేజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా రాజకీయాల్లోనూ, ఇటు మాటల్లోనూ దిట్ట. ఎదుటి వారిని ఆకర్షించేలా ప్రసంగాలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో కొనసాగే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు.
 
2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కళ్లన్నీ రేవంత్ నియోజకవర్గం పైనే. టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఈసారి ఎలాగైనా రేవంత్‌ని రాజకీయంగా దెబ్బతీయాలని గట్టి ప్రయత్నాలే చేసింది. ఎన్నికల పోలింగ్‌కి రెండు మూడు రోజుల ముందు కొడంగల్‌లో హైడ్రామాకి తెరలేచింది. కొడంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటనని నిరసిస్తూ రేవంత్ ప్రకటించడంతో కేసీఆర్ సభకి ఆటంకం కలగకూడదని అర్ధరాత్రి రేవంత్‌ని అరెస్ట్ చేశారు. ఈ అంశంపై టీఆర్‌ఎస్, రేవంత్ రెడ్డి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. చివరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. 71,146 ఓట్లను సాధించి రేవంత్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.   
వ్యాపారాలు, ఆస్తులు >
రియల్‌ ఎస్టేట్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌ వ్యాపారాలున్నాయి. 2014 ఎన్నికల అనంతరం 31-5-2015న ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. హైదరాబాద్‌లో, కొండరెడ్డిపల్లిలో ఇళ్లు ఉన్నాయి.
ఆసక్తికర విషయాలు >
మాటల చాతుర్యంతో ఇతరుల మన్ననలు పొందుతారు. హాకీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ రెండు సార్లు కొడంగల్‌ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు.

వీడియోస్

ADVT