పుట్టిన తేదీ : 24-7-1976
పుట్టిన స్థలం : సిద్దిపేట, మెదక్ జిల్లా
తల్లిదండ్రులు : కల్వకుంట్ల చంద్రశేఖర రావు, శోభ
భార్య : శైలిమ
పిల్లలు : హిమాన్షు (కుమారుడు), అలేఖ్య (కూతురు)
విద్యార్హతలు : ఎమ్మెస్సీ (బయోటెక్నాలజీ), పూణే యూనివర్శిటీ, ఎంబీఏ (ఈ కామర్స్, మార్కెటింగ్) సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్
బంధువులు : కె. చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రి (తండ్రి), కల్వకుంట్ల కవిత, ఎంపీ (చెల్లెలు), తన్నీరు హరీశ్ రావు, మంత్రి (బావ)
రాజ‌కీయ ప్ర‌స్థానం >
కేటీఆర్ 2006లో తన విద్యాభ్యాసం పూర్తికాగానే న్యూయార్క్‌లోని షిప్పింగ్ అండ్ ఓషియన్ లాజిస్టిక్స్ అనే సంస్థలో ఉద్యోగస్తునిగా చేరారు. తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2006లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన తండ్రి కేసీఆర్ తరపున ప్రచారకర్తగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. దీంతో ఈయనకు ఈ ఎన్నికల ద్వారా రాజకీయ అనుభవం దక్కింది. ఇదే అదునుగా భావించిన కేటీఆర్ 2009లో మొట్టమొదటి సారిగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ పరీక్షలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కె.కె. మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
 
తర్వాత రాజకీయ వ్యూహాంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్‌ను తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలని ఆదేశించడంతో ఈయన మరో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ సిరిసిల్ల నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.కె. మహేందర్ రెడ్డిపై 68 వేల పైచిలుకు ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు.
 
తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ అధినేత ఇచ్చిన ప్రతీ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. ఆయనిచ్చిన పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో సిరిసిల్ల నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్ రావుపై 53 వేల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కేబినెట్‌లో కీలక మంత్రి పదవులైన ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ముందస్తు ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా 88,009 ఓట్ల భారీ మెజారిటీతో సిరిసిల్లలో తన హవా కొనసాగించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డికి కేవలం 36,204 ఓట్లు రాగా..కేటీఆర్‌కు 1,25,213 ఓట్లు వచ్చాయి.
 
అభివృద్ధిలో కీలకపాత్ర: సిరిసిల్ల నియోజకవర్గం చేనేత రంగానికి ప్రసిద్ధి. 2009 వరకు చేనేత కార్మికుల ఆత్మహత్యలు భారీ సంఖ్యలో జరిగేవి. చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించడానికి కేసీఆర్ ‘ఓదార్పు యాత్ర’ చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ కూడా చేనేత కార్మికులకు ఇన్సూరెన్స్, భారీ సబ్సిడీలను ప్రకటించి చేనేత కార్మికులకు ఊరట కల్పించారు. అంతేకాకుండా ఈయన ఏదో ఒక రంగానికి చెందిన ప్రముఖలతో చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించి ప్రజలు వాటిని ఎక్కువగా వాడేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
వ్యాపారాలు, ఆస్తులు >
కేటీఆర్ నేరుగా ఎందులో పెట్టుబడులు పెట్టలేదు. పరోక్షంగా మాత్రం కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు.
 
2014 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్  ప్రకారం ఆస్తులు: 7 కోట్లు. చరాస్తులు రెండు కోట్ల రూపాయలు.
ADVT