అవతార సమాప్తి
17-05-2018 22:46:31
(గత సంచిక తరువాయి)
1896 సెప్టెంబరు 1న పదహారు, పదిహేడు సంవత్సరాల ప్రాయంలో తిరువణ్ణామలైకి చేరిన రమణులు జగత్ప్రసిద్ధులైన మహర్షిగా 54 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. 1949 ఫిబ్రవరిలో ఎడమ మోచేతి దగ్గర బఠాణి గింజంత కణితి లేచింది. ఎప్పుడూ దురద పెడుతూ ఉండేది. మహర్షి కుడిచేత్తో ఆ కణితిని రుద్దుతూ ఉండేవారు. దీనిని చూసిన పరిచారకులు ఆశ్రమం డాక్టర్‌ శంకరరావుతో చెప్పారు.
 
ఆ కణితిని కోసేస్తే సరిపోతుందన్నాడు ఆయన. అప్పటికీ కొందరు ఆశ్రమవాసులు శ్రీభగవాన్‌ మామూలు మనుష్యులు కారు, తొందరపడి ఏమీ చేయవద్దన్నారు. అవసరమైతే మద్రాసు నుంచి పెద్ద డాక్టర్లను పిలిపిద్దామని సలహా ఇచ్చారు. అప్పటి నుంచీ దాదాపు పదహారు నెలలు శ్రీభగవాన్‌కి ఏవేవో వైద్యాలు చేశారు. ఆ కణితి క్యాన్సర్‌ అని నిర్ధారించారు. నాలుగు ఆపరేషన్లు చేశారు. రేడియం సూదులు గుచ్చారు. ఏం చేసినా అది తగ్గలేదు. ఎవరు ఏ వైద్యం చేస్తామన్నా భగవాన్‌ వారించేవారు కాదు. చేతిని కోసేయాలన్నప్పుడు మాత్రం అంగీకరించలేదు. వారి వైఖరి ఇది. ఆశ్రమం వాళ్లూ, ఇతర భక్తులూ చేసేదేదో చేసుకోనీ. ఇది వాళ్లకి సంతృప్తికరం. నేనెందుకు అడ్డుతగలాలని!
(సశేషం)
-పింగళి సూర్యసుందరం
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.