క్యాంపస్‌లో తిరిగారో ఖబడ్దార్ : లక్నో విశ్వవిద్యాలయం
13-02-2018 14:04:26
లక్నో : పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో చెలరేగిపోవద్దని విద్యార్థినీ, విద్యార్థులను లక్నో విద్యాలయం హెచ్చరించింది. ఫిబ్రవరి 14న మహాశివరాత్రి సందర్భంగా విశ్వవిద్యాలయానికి సెలవు ప్రకటిస్తున్నామని, తరగతులు, ప్రత్యేక తరగతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాక్టికల్స్ వంటివేవీ జరగబోవని తెలిపింది. ఆ రోజు ఎవరైనా క్యాంపస్‌లో తిరిగారంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నెల 10న ఈ నోటీసును జారీ చేసింది.
 
ఇటీవల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి గురై ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను జరుపుకుంటున్నారని ఈ నోటీసులో విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓ విషయాన్ని తెలియజేస్తున్నామని పేర్కొంది. ఫిబ్రవరి 14న విద్యార్థులెవరూ క్యాంపస్‌లో సంచరించకూడదని పేర్కొంది. విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ‘‘మీ పిల్లలను విశ్వవిద్యాలయానికి పంపించవద్ద’’ని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించి క్యాంపస్‌లో అనవసరంగా సంచరిస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Tags : lucknow, university, campus
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.