‘ప్యాడ్ కపుల్స్‌’: నెలకు 5 వేల శానిటరీ ప్యాడ్ల పంపిణీ
13-02-2018 12:12:43
సూరత్: బాలీవుడ్ సినిమా ‘ప్యాడ్ మ్యాన్’ అఖండ విజయం సాధించడంతో పాటు సమాజంతో చైతన్యం తెచ్చేందుకు దోహదపడింది. ఇప్పుడంతా ఎటువంటి సంకోచాలు లేకుండా ప్యాడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఉందంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో సూరత్‌కు చెందిన ‘ప్యాడ్ కపుల్’ కథ విభిన్నమైనది. మీనా మెహతా, అతుల్ మెహతా దంపతులు గత ఐదేళ్లుగా ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వీరు ప్రతీ నెలా అవసరమైన మహిళలకు, బాలికలకు ఐదు వేల శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలు, బాలికలు శానిటరీ ప్యాడ్‌లను కొనుగోలు చేయలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి వారికి వారికి ప్యాడ్‌లను ఈ దంపతులు అందిస్తుంటారు. ఇందుకోసం ఈ జంట మురికివాడల్లో కూడా పర్యటిస్తుంటుంది.
Tags : padman movie, sanitary napkins
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.