ADVT
బస్సులో నా నడుముపై చేయి వేశాడు...యువతి వీడియో సాక్ష్యం
13-02-2018 07:33:34
న్యూఢిల్లీ : తాను యూనివర్శిటీ నుంచి ఇంటికి బస్సులో వెళుతుండగా ఓ ప్రయాణికుడు తన నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ హస్తప్రయోగం చేశాడని ఓ యువతి వీడియో సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న ఓ యువతి 774 రూట్ నంబరు బస్సులో ఇంటికి వెళుతోంది. యువతి కిటికీ పక్కన సీటులో కూర్చొని పుస్తకం చదువుకుంటుండగా పక్కన కూర్చున్న 40 ఏళ్ల ప్రయాణికుడు యువతిని తాకుతూ  హస్తప్రయోగం చేశాడు. యువతి ఈ విషయాన్ని బస్సులో ఉన్న ప్రయాణికులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో యువతి ప్రయాణికుడు బస్సులోనే హస్తప్రయోగం చేస్తుండగా తన మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో తీసింది. అనంతరం యువతి బస్సులో ప్రయాణికుడి పాడు పని గురించి వీడియో సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.పట్టపగలే బస్సులో అసభ్యంగా తాకుతూ చేసిన పాడుపని ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంలోనూ తాత్సారం చేశారు. దీన్ని ట్విట్టర్ లోనూ పోస్టు చేసింది. దీంతో కదిలిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ చెప్పారు.
Tags : woman..., Delhi, Molestation

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.