మంచం కింద నాటుబాంబు పెట్టి చంపేశారు..
13-02-2018 07:02:32
నల్గొండ: జిల్లాలోని సాగర్ తిరుమలగిరి మండలం నాగార్జునపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చింతలపాలెం కాంగ్రెస్‌ ఉప సర్పంచ్‌ ధర్మానాయక్ హత్యకు గురైయ్యాడు. ధర్మానాయక్ మంచం కింద ప్రత్యర్థులు నాటుబాంబు పేల్చడంతో ధర్మానాయక్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురౌతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.