ADVT
రైల్వే ప్రయాణికులకు శుభవార్త...ఇక హై స్పీడ్ రైళ్లు
13-02-2018 07:01:44
న్యూఢిల్లీ : దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త...గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా కొత్త హై స్పీడ్ కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దేశంలో పదివేల కిలోమీటర్ల దూరం కొత్తగా హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణంపై కసరత్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రకటించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్ణయించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరేలా హైస్పీడ్ రైల్వే ట్రాక్ ను నిర్మించాలని నిర్ణయించారు. కిలోమీటరు రైల్వేట్రాక్ నిర్మాణానికి వందకోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్థుతమున్న రైల్వే ట్రాక్ పక్కన రైల్వే స్థలాల్లో లేదా జాతీయ రహదారుల పక్కన రైలు ట్రాక్ నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్థుతం ముంబై -పూణే నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం మూడు గంటలు పడుతోంది. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం ద్వారా ప్రయాణ సమయాన్ని గంటకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.
Tags : train, high speed driving, Indian railway

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.