ADVT
తల్లీకొడుకు సైకిల్‌పై వెళుతుండగా... ఢీకొట్టిన లారీ
13-02-2018 06:53:16
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు చోడుదిబ్బకు చెందిన ముత్యాల మంగ హీరో షోరూంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. పని ముగించుకుని కుమారుడితో కలిసి ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో తల్లీకొడుకులు ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
 
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఖచ్చితమైన హామీ వచ్చేవరకూ మృత దేహాలను తరలించేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు బాధిత కుటుంబానికి తమ శాఖ తరుపున పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతుల బంధువులు ఆందోళన విరమించారు.
Tags : west godavari, eluru, Road Accident

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.