ADVT
22 నుంచి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు
13-02-2018 06:53:14
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసే ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఈ నెల 22 నుంచి 25 వరకు ఇంటర్వ్యూల ప్రక్రియ జరుగుతుందని వీసీ ఆచార్య ఏ రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ప్రొఫెసర్లు (8), అసోసియేట్‌ ప్రొఫెసర్లు (1), అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (5) చొప్పున భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కాలేజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ) ప్రొఫెసర్‌ పోస్టుకు ఇంటర్వ్వూ తేదీని ఖ రారు చేయలేదన్నారు. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టీ (ఉమెన్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డీఎంసీ విభాగంలో ఓసీ (ఉమెన్‌), అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తులు వచ్చినప్పటికీ సంబంధిత అర్హతలు గల అభ్యర్థులు లేకపోవడంతో ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు.
 
ఇంటర్వ్యూల షెడ్యూల్‌ ..
  • 22న తెలుగు అండ్‌ ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ (ప్రొఫెసర్‌), ఇంగ్లీషు (అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), సోషియాలజీ అండ్‌ సోషల్‌ వర్క్‌ (ప్రొఫెసర్‌), లా విభాగంలో (అసిస్టెంట్‌), మేథమ్యాటిక్స్‌లో (ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌),
  • 23న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చైర్‌ (ప్రొఫెసర్‌), జువాలజీ (ప్రొఫెసర్‌), బోటనీ అండ్‌ మైక్రో బయాలజీ (ప్రొఫెసర్‌),
  • 24న హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ (ప్రొఫెసర్‌), కంప్యూటర్‌ సైన్స్‌(అసిస్టెంట్‌), కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ప్రొఫెసర్‌)
  • 25న టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌(అసిస్టెంట్‌ ) పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వీసీ తెలిపారు. ఇప్పటికే సంబంధిత అభ్యర్థులకు ఈమెయిల్‌, పోస్టు, ఫోన్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించామన్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.