కాళ్ల పారాణి ఆరకముందే...కట్టుకున్నవాడిపై ఫిర్యాదు
13-02-2018 06:48:55
పాట్నా: పెళ్లయి ఆరుగంటలయ్యిందోలేదో... పెళ్లికూతురు అదే ముస్తాబుతో పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. తన భర్త వైభవ్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, చంపేస్తాననని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కట్నం డిమాండ్ చేస్తున్నాడని కూడా ఆరోపించింది. దీంతో సదరు కొత్త పెళ్లికొడుకును పోలీసులు అరెస్టు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూతన వధువు ఫిర్యాదుతో... వివాహం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వీరిని చూసిన వరుడు కంగుతిన్నాడు. పోలీసులు అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఈ వార్త సంచలనంగా మారింది.
Tags : After marriage, PATNA, Bride
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.