విజయవాడ: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కనకదుర్గమ్మను సోమవారం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు అవంతి శ్రీనివాస్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యులు వెలగపూడి శంకరబాబు, జి.పద్మశేఖర్, కె.సూర్యలతకుమారి, ఆలయ పీఆర్ఓ ఎస్.అచ్చుతరామయ్య వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజ నిర్వహించారు. వేద పండితులు వారికి అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. అనంతరం చిత్రపటం, అమ్మవారి లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం బహూకరించారు.