‘ఫీజురీయింబర్స్‌మెంట్‌,విదేశీ విద్యానిధి’ దేశవ్యాప్తంగా అమలు చేయాలి
13-02-2018 06:17:39
హైదరాబాద్ : బీసీల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, విదేశీ విద్యానిధి పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావా లని కోరుతూ రాష్ట్ర బీసీ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్ వి.గంగాధర్‌గౌడ్‌, సభ్యులు చింత ప్రభాకర్‌, బాలస్వామి లక్ష్మీనారాయణ, ఫారుఖ్‌ హుస్సేన్ లకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్‌.కృష్ణయ్య సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్ల సాధన కోసం 22న తిరుపతిలో బీసీ విద్యార్థి, యువజన జాతీయ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విదేశీ విద్యానిధి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర బీసీ లెజి స్లేచర్‌ కమిటీ ఒత్తిడి తీసుకురావాలని గంగాధర్‌గౌడ్‌ను కోరిన ట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం తరపున ఇచ్చిన ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించాలని కోరినట్లు తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం బీసీ లెజిస్లేచర్‌ తరపున కృషి చేస్తామని గంగాధర్‌గౌడ్‌ హామీ ఇచ్చినట్లు ఆర్‌.కృష్ణయ్య వివరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రతినిధులు భూపేష్‌సాగర్‌, గజేందర్‌, ఎస్‌.రామ లింగం, సి.రాజేందర్‌, మహేందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.