బాపూ అస్థికల నిమజ్జన దినం సందర్భంగా ఘన నివాళి
13-02-2018 06:15:53
హైదరాబాద్ : జాతి పిత మహాత్మాగాంధీ అస్థికల నిమజ్జన దినాన్ని సోమవా రం నగరంలోని లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌లో నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై బాపూజీకి పూలమాలలతో నివాళుల ర్పించారు. ఈ కా ర్యక్రమాన్ని గాంధీ ధ్యాన మందిరంలో స ర్వోదయ ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు గాంధేయవాదులు మాట్లాడుతూ దేశానికి మహా త్మాగాంధీ చేసిన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో గాంధీ అస్థికల నిమజ్జన స్థాప కుల్లో ఒకరైన బాబారావ్‌ వర్మ, గాంధీ మెమోరియల్‌ చైర్‌పర్సన జక్కీ, వైస్‌ చైర్‌పర్సన్‌ పెస్టోనజీ, కోశాధికారి సురేంద్రలోనియా, మేనేజింగ్‌ ట్రస్టీ ఇస్మాత మోదీతో పాటు బాపూ స్మృతి సమితి సభ్యులు పరమానందం, కాంగ్రెస్‌ నాయకురాలు శోభాపాండే తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.