హైదరాబాద్‌ నగరంలో వర్షపునీటి పార్కు : మంత్రి కేటీఆర్‌
13-02-2018 06:13:38
 హైదరాబాద్‌ : భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా.. ఇంకుడు గుంతల నిర్మాణం.. వాటి ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేక పార్కు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వాన నీటిని ఒడిసి పట్టడం... పునర్వినియోగం ఎలా చేయాలన్నది ప్రత్యక్షంగా ప్రజలు చూసేందుకు వీలుగా వర్షపునీటి పార్కు రూపుదిద్దుకోనుంది. పార్కులో పెరిగే చెట్లు, ఇతర నిర్వహణ అ వసరాల కోసం నల్లా, ఇతర నీటిని వినియోగించకుండా కేవలం అందులో నిల్వ చేసిన వాన నీటిని ఉపయోగించేలా ప్రత్యేకంగా నిర్మించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహానగరం లో ఇంకుడుగుంతల పార్కు నిర్మిస్తామని పురపాలన, పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు వివిధ విభాగాలతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. పాతాళానికి పడిపోయిన గంగమ్మను పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జలం- జీవం కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. విభాగాల వారీగా మంత్రి లక్ష్యాలు నిర్దేశించారు. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే పార్కులు, ఖాళీ స్థలాల్లో ఇంకుడుగుం తల నిర్మాణంపై దృష్టి సారించింది. బ్యాంకు రుణాలు ఇప్పించి మరీ ప్రజలు ఇంకుడుగుంతలు తవ్వేలా వాటర్‌బోర్డు ప్రత్యేక చొరవ తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిం చేందుకు టీ-శాట్‌ ద్వారా శాటిలైట్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో గుంతకు రూ.10 నుంచి 30, 40 వేల వరకు ఖర్చువుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. కొన్ని ఏజెన్సీలను గుర్తించి బోర్డు వెబ్‌సైట్‌ www.hmwssb. gov.inలో అందుబాటులో ఉంచనున్నారు. స్థలం అందుబాటు లో ఉంటే ఇంకుడుగుంత తప్పనిసరిగా నిర్మించాలని, ఎన్ని ఇం కుడు గుంతలు వీలైతే అన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వాటర్‌ బోర్డు ఎండీ దానకిషోర్‌ అధికారులకు సూచించారు.
Tags : Ktr, water
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.