బాలికపై సామూహిక అత్యాచారం
10-02-2018 03:23:04
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 
గుంటూరు, ఫిబ్రవరి 9: గుంటూరులో 8వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన. ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... నల్లచెరువు 14వ లైన్‌కు చెందిన బాలిక(14) గతనెల 28న ఇంటివద్ద ఆడుకుంటుండగా.. అదే ప్రాంతానికి చెందిన నలుగురు ఐస్‌క్రీమ్‌ కొనిస్తామని ఆటోలో తీసుకెళ్లారు. పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో వదిలివెళ్లారు. నీరసంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆరాతీయగా జరిగిన విషయం చెప్పింది. అదే ప్రాంతానికి చెందిన రంగ, వెంకటేశ్‌, సుబ్బు, సురేష్‌ తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి శుక్రవారం లాలాపేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలికను మభ్యపెట్టి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న వృద్ధుడిని దువ్వాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విశాఖ నగర పరిధిలోని 55వ వార్డు ఇస్లాంపేట కేఎం పాలేనికి చెందిన షేక్‌ అహ్మద్‌ ఫాజిల్‌(50) తన మేనకోడలి వరుస అయిన బాలిక(17)ను మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు. ఇటీవల బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఆరాతీయగా ఫాజిల్‌ అకృత్యం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫాజిల్‌ను అరెస్ట్‌ చేశారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.