ADVT
‘తొలి’ సిరీస్‌ ఊరిస్తోంది!
10-02-2018 03:04:37
ఒకే ఒక్క విజయం.. పాతికేళ్ల ఎదురు చూపులకు చరమగీతం పాడనుంది.. దక్షిణాఫిక్రా గడ్డపై పరాభవాలకు సమాధానం ఇవ్వనుంది.. ఎంతో మంది ఆటగాళ్లు కన్న కలలను సాకారం చేయనుంది. సఫారీ నేలపై ఇప్పటిదాకా అందకుండా ఊరిస్తున్న వన్డే సిరీస్‌ విజయం కోసం భారత జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌ దూరంలోనే ఉంది. ప్రత్యర్థి వెన్నులో గుబులు పుట్టిస్తున్న కోహ్లీ సేన ఇప్పటికే 3-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అందుకే మరో విజయం చాలు.. జట్టు చిరస్మరణీయ క్షణాలను ఆస్వాదించేందుకు.. అభిమానులు సగర్వంగా తలెత్తుకునేందుకు.. ఇదే లక్ష్యంతో చరిత్రలో మైలురాయిలా నిలిచే గెలుపు కోసం నేడు జరిగే నాలుగో వన్డేలో భారత్‌ బరిలోకి దిగనుంది.. ఈ విజయంతో భారత జట్టు ఖాతాలో నెంబర్‌వన్‌ ర్యాంకు కూడా వచ్చి చేరుతుంది.
 
ఇక అన్ని విభాగాల్లో బలహీనపడిన దక్షిణాఫ్రికాకు డివిల్లీర్స్‌ ఆశాకిరణంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చి వేయగల సత్తా కలిగిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఆఖరి మూడు వన్డేలకు అందుబాటులో ఉండడంతో వారికి ప్రాణాలు లేచి వచ్చినట్టయ్యింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్య జట్టు గులాబీ జెర్సీతో బరిలోకి దిగబోతోంది. ఈ జెర్సీ ఒంటి మీదుంటే శివాలెత్తిపోయే డివిల్లీర్స్‌ను భారత బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారో చూడాలి!
  • దక్షిణాఫ్రికాతో నేడు నాలుగో వన్డే
  • గెలిస్తే సిరీస్‌తో పాటు భారత్‌కు నెం.1 ర్యాంకు
  • డివిల్లీర్స్‌పైనే ఆతిథ్య జట్టు ఆశలు
జొహాన్నెస్‌బర్గ్‌: వరుస విజయాలతో జో రుమీదున్న భారత్‌ ఇప్పుడు అత్యంత కీలక మ్యాచ్‌పై కన్నేసింది. 1991-92లో తొలిసారిగా పర్యటించినప్పటి నుంచి ఏ భారత జట్టూ సాధించని వన్డే సిరీ్‌స ను దక్కించుకునేందుకు సిద్ధమైంది. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్‌ నెగ్గితే 4-0తో తొలిసారిగా సిరీ్‌సను భారత్‌ వశం చేసుకుంటుంది. అలాగే వన్డేల్లో టాప్‌ ర్యాంకు కూడా అధికారికంగా ఖరారవుతుంది. గతంలో 2010-11 టూర్‌ లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇక్కడ సిరీస్‌ నెగ్గినట్టే కనిపించింది. ఐదు వన్డేల సిరీ్‌సలో మొదట 2-1 ఆధిక్యంలో కొనసాగి ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు ఓడిం ది. ఇప్పుడూ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎలాంటి అలక్ష్యం లేకుండా ప్రత్యర్థిని దెబ్బతీయాల్సి ఉంటుంది. అటువైపు దక్షిణాఫ్రికాకు అతిపెద్ద సాంత్వ న.. డివిల్లీర్స్‌ రాక. తమ వరుస ఓటములకు అతడి మేజికల్‌ బ్యాటింగ్‌ అడ్డుకట్ట వేస్తుందనే ఆశతో ఉంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా సఫారీ జట్టు గులాబీ జెర్సీతో ఈ మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. 2011లో ఈ జట్టు తొలిసారిగా ‘పింక్‌ వన్డే’ ఆడింది.
 
ఎదురులేని స్థితిలో...: భారత్‌కు ఈ సిరీస్‌కున్న ప్రాముఖ్యం ఏమిటో బాగానే తెలుసు. అందుకే హ్యాట్రిక్‌ విజయాలు సాధించినా ఎలాంటి ఏమరుపాటులో లేమని ఓపెనర్‌ ధవన్‌ ఇప్పటికే స్పష్టం చేశా డు. ఈ మ్యాచ్‌కూ జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. బ్యాటింగ్‌లో కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలతో హోరెత్తించాడు. ధవన్‌ ఫామ్‌ సరేసరి. రోహిత్‌ ఒక్కడే క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటిదాకా అతడు చేసిన మొత్తం పరుగులు 35 మాత్రమే.. అయినా అతని స్థానానికి ఢోకా లేనట్టే. మిడిలార్డర్‌ అంతగా ఆకట్టుకోలేకపోతున్నా కోహ్లీ మాయతో ఇబ్బంది ఎదురవడం లేదు. కానీ ధోనీ, పాం డ్యా, జాదవ్‌ బ్యాట్లను ఝుళిపించాల్సి ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ ప్రత్యర్థిని చాపచుట్టేస్తున్నారు. ఇప్పటిదాకా పడిన 28 వికెట్లలో 21 వీరిపేరిటే ఉన్నాయి. పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తే భారత్‌కు మరో విజయం సులువవుతుంది.
 
డివిల్లీర్స్‌పైనే ఆశలు..: మూడు వన్డేల్లోనూ ఓటములతో నిరాశగా ఉన్న దక్షిణాఫ్రికాను గట్టెక్కించేందుకు డివిల్లీర్స్‌ రంగంలోకి దిగనున్నాడు. ఈ వన్డేకు అతను ఫిట్‌గా ఉన్నట్టు శుక్రవారం సాయంత్రం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ప్రాక్టీ్‌సలో అతను ఇబ్బంది లేకుండా బంతిని హిట్‌ చేశాడు. వైవిధ్యమైన షాట్లతో క్రికెట్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ స్టార్‌ ఆటగాడికి స్పిన్‌ బౌలింగ్‌ను కూడా దీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. 2015లో జరిగిన పింక్‌ వన్డేలో విండీ్‌సపై డివిల్లీర్స్‌ వేగవంతమైన (31 బం తుల్లో) శతకంతో రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 5 గులాబీ వన్డేల్లో 250 ప రుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు మూడో నెంబర్‌లో రానున్నాడు. డుమిని నాలుగోస్థానానికి వెళతాడు. మిల్లర్‌, జోండోలలో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆమ్లా, మార్‌క్రమ్‌ రాణించాల్సి ఉంది.
 
  • వాండరర్స్‌ మైదానంలో భారత్‌ ఏడు మ్యాచ్‌ల్లో ఆడగా మూడుసార్లు గెలిచింది.
  • గులాబీ జెర్సీతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా నెగ్గింది.
  • శిఖర్‌ ధవన్‌కిది వందో వన్డే. 

పిచ్‌, వాతావరణం
సహజంగానే ఇక్కడి పిచ్‌ భారీ స్కోర్లకు అనుకూలంగా ఉంటుంది. నేటి మ్యాచ్‌లో కూడా బ్యాట్స్‌మెన్‌ చెలరేగవచ్చు. చిరు జల్లులకు అవకాశమున్నా ఆటకు ఇబ్బందిలేదు.
 
జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, ధోనీ, జాదవ్‌, పాండ్యా, భువనేవ్వర్‌, కుల్దీప్‌, బుమ్రా, చాహల్‌.
దక్షిణాఫ్రికా: ఆమ్లా, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డివిల్లీర్స్‌, డుమిని, బెహర్డీన్‌, మిల్లర్‌/జోండో, మోరిస్‌, ఫెహ్లుక్వాయో, రబాడ, మోర్కెల్‌, తాహిర్‌.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.