పాల కోసం ఏడుస్తోందని ఏడాది బిడ్డ గొంతు కోసేసింది
10-02-2018 03:04:13
ధర్‌ (మధ్యప్రదేశ్‌), ఫిబ్రవరి 9: ఏడాది పసిపాప.. ఆకలేసి గుక్కపెట్టి ఏడుస్తోంది! ఏ అమ్మయినా ఏం చేస్తుంది? ఎక్కడున్నా పరుగున వస్తుంది. బిడ్డను ఒడిలోకి తీసుకుని.. పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఆ కఠినాత్మురాలికి మాత్రం పసిదాని రోదనతో కోపం కట్టలు తెగింది. పేగుబంధాన్ని పాశవికంగా తెంచేసింది. మళ్లీ ఆ ఏడుపు వినపడకుండా కొడవలితో బిడ్డ గొంతు కోసేసింది. గుక్కెడు పాల కోసం ఏడ్చి ఏడ్చి ఆ చిన్నారి రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. గుండెలు పిండేసే ఈ ఘోరం మధ్యప్రదేశ్‌లోని ధర్‌ జిల్లాలో జరిగింది. అనితా సింగ్‌ (25)అనే ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ‘‘పాల కోసం ఏడుస్తున్న బిడ్డను ఎత్తుకొని అనిత కోపంగా ఇంట్లోకి వెళ్లింది. కాసేపటికే బిడ్డ ఏడుపు ఆగిపోయింది. అనిత ఆదరాబాదరాగా బయటకొచ్చింది. ఇది చూసి ఆమె అత్తకు అనుమానం వచ్చి లోపలికెళ్లి చూసి హతాశురాలైంది’’ అని ఏఎస్పీ రాయ్‌సింగ్‌ నర్వరియా తెలిపారు. కూతురు పదే పదే ఏడుస్తుండడంతో తానే చంపానని అనిత అంగీకరించింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.