ఐఏఎఫ్‌ అధికారికి హనీట్రాప్‌
10-02-2018 03:03:34
  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి కీలక సమాచారం
  • అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత వాయుసేనకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐకి చేరవేశాడన్న ఆరోపణలతో ఐఏఎఫ్‌ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని వాయుసేన ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న గ్రూప్‌ కెప్టెన్‌ అరు ణ్‌ మార్వాహా కొంత కాలంగా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఐఎ్‌సఐకు అందించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు 5 రోజుల పోలీసు కస్టడీ విధించింది. నిరుడు డిసెంబరులో అరుణ్‌కు ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఎయిర్‌పోర్స్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను వాట్సప్‌ ద్వారా ఆమెకు పంపాడు. అధికారుల ఫిర్యాదు మేరకు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం నిఘా పెట్టి అరుణ్‌ను అదుపులోకి తీసుకుంది. కీలక సమాచారం చేరవేసినట్లు అఽధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఐఏఎఫ్‌ అధికారికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి పాక్‌ గూఢచారి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.