క్లీన్‌స్వీప్‌పై అమ్మాయిల గురి
10-02-2018 03:01:24
  • సౌతాఫ్రికాతో చివరి వన్డే నేడు
పోచెఫ్‌స్ర్టోమ్‌: వరుసగా రెండు విజయాలతో సిరీస్‌ను పట్టేసిన భారత అమ్మాయిలు క్లీన్‌స్వీ్‌పపై గురిపెట్టారు. సౌతాఫ్రికా మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. గత రెండు మ్యాచ్‌ల జోరును కొనసాగిస్తూ.. ఈ వన్డేలోనూ నెగ్గి సఫారీలను 3-0తో వైట్‌వాష్‌ చేయాలని మిథాలీసేన కృత నిశ్చయంతో ఉన్నది. మహిళల వన్డే చాంపియన్‌షి్‌పలో భాగంగా జరుగుతున్న ఈ సిరీ్‌సలో మిథాలీసేన అటు పేస్‌తో పాటు స్పిన్‌తోనూ సఫారీలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. గత మ్యాచ్‌తో 200 వికెట్లు ఖాతాలో వేసుకున్న పేసర్‌ జులన్‌ గోస్వామి అంతే గొప్పగా సిరీ్‌సను ముగించాలని భావిస్తోంది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.