చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
10-02-2018 02:56:14
  • కలిసి నడిచిన ఉత్తర, దక్షిణ కొరియా
  • వింటర్‌ ఒలింపిక్స్‌ ఆరంభం
ప్యాంగ్‌చాంగ్‌ (దక్షిణకొరియా) : మంచు కొండల్లో జరిగే అద్భుత క్రీడా పోటీల వేదిక.. వింటర్‌ ఒలింపిక్స్‌ శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమ య్యింది. ఈ క్రీడలను దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ప్రారంభించారు. సంయుక్త కొరియా మహిళా హాకీ జట్టు అందించిన కాగడాతో దక్షిణ కొరియా ఫిగర్‌ స్కేటింగ్‌ స్వర్ణ పతక మాజీ విజేత కిమ్‌ యు నా ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించింది. కాగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెల్లెలు కిమ్‌ యో జిం గ్‌, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ముందు వరుసలోనే ఆశీనులయ్యారు. కొన్నేళ్లుగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలి సిందే. ఆరంభ వేడుకల్లో నీలం-తెలుపు రంగులతో కూడి ఐక్య కొరియా పతాకతో రెండు దేశాల అథ్లెట్లు మార్చ్‌పా్‌స్టలో పాల్గొనగా స్టేడియం చప్పట్లతో మార్మోగింది.
 
భారత పతాకంతో కేశవన్‌..
ఇక మార్చ్‌పా్‌స్టలో స్టార్‌ లుగెర్‌ శివ కేశవన్‌, క్రాస్‌కంట్రీ స్కీయర్‌ జగదీష్‌ సింగ్‌, చెఫ్‌-డి-మిషన్‌ హర్జిందర్‌సింగ్‌లతో కూడిన ఆరుగురు సభ్యుల భారత బృందం పాల్గొంది. ఆరో వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న కేశవన్‌.. భారత పతాకతో ముందుకు నడిచాడు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.