చాంపియన్స్‌ ట్రోఫీపై అనుమానాలు
10-02-2018 02:54:39
దుబాయ్‌: భారత్‌లో 2021లో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ ట్రోఫీ కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి పన్ను మినహాయింపును ఇవ్వకపోతే మరో వేదికకు తరలిస్తామని బీసీసీఐని ఐసీసీ హెచ్చరించింది. శుక్రవారం దుబాయ్‌లో జరిగిన తమ బోర్డు మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ వేదికలను కూడా చూడాలనుకుంటోంది. ’భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌కు పన్ను మినహాయింపు ఉండడం లేదు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడతామని బీసీసీఐ మాకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఇదే టైమ్‌జోన్‌లో ఉండే ఇతర దేశాలపై మేం దృష్టి సారిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది. 2006లో భారత్‌లోనే జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీకి అప్పటి యూపీఏ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చినా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ (2016) నకు ఎన్‌డీఏ ప్రభుత్వం అలాంటి వెసులుబాటును కల్పించలేదు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.