ఐసీసీ డైరెక్టర్‌గా ఇంద్రానూయీ
10-02-2018 02:53:45
దుబాయ్‌: పెప్సీకో చైర్మన్‌, సీఈవో ఇంద్రానూయీ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వచ్చే జూన్‌లో ఆమె ఐసీసీ బోర్డులో చేరతారు. స్వతంత్ర చైర్మన్‌ హోదాలో ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈమేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఇంద్రానూయీ నియామకాన్ని ఖరారు చేశారు. ఇంద్రానూయీ పదవీకాలం రెండు సంవత్సరాలు. అయితే ఆరేళ్లు మించకుండా ఆమె పదవీకాలాన్ని రెండుసార్లు పొడిగించవచ్చు. ‘ఐసీసీలో చేరనుండడం ఎంతో ఉత్కంఠ కలిగిస్తోంది. బోర్డులోని మిత్రులు, ఇతర ఐసీసీ భాగస్వాములు, ప్రపంచంలోని క్రికెటర్లతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. క్రికెట్‌ను మరింత జనరంజకంగా తీర్చిదిద్దడంలో నావంతు పాత్ర పోషిస్తా’ అని ఇంద్రానూయీ ఓ ప్రకటనలో తెలిపారు. ఓ మహిళను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించడం ఐసీసీ పరిపాలనను మెరుగుపరచడంలో ముందడుగుగా చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ అభివర్ణించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.