‘స్థానికత’పై రాజీ మార్గం!
10-02-2018 02:53:01
 •  ఉద్యోగుల వివాదంపై విద్యుత్‌ సంస్థల నిర్ణయం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల వివాదంలో రాజీ మార్గమే అనుసరించాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు యోచిస్తున్నాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై అప్పీల్‌కు వెళ్లడం, రివ్యూ పిటిషన్‌ దాఖలుచేయడం వంటివి చేయరాదని భావిస్తున్నాయి. ఏపీతో సంప్రదింపుల అనంతరం సమగ్ర మార్గదర్శకాలు రూపొందించి, విభజన ప్రక్రియ ప్రారంభించాలని ఎట్టకేలకు నిర్ణయించాయి. ఇటీ వలే ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగుల రిలీవ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసి, రెండు నెలల్లోపు విభజనకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించడం తెలిసిందే. దీనిపై అప్పీల్‌కు వెళితే ఏ విధంగా ఉంటుందని న్యాయనిపుణులను సంప్రదించగా... ఆ ప్రయత్నం వద్దని వారు వారించినట్లు సమాచారం. దాంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి అధికారులు తాజాగా నివేదించారు.
 
ఉద్యోగులకు ‘పరస్పర’ తంటాలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి రావాలని/వెళ్లాలని ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. అంతర్రాష్ట్ర బదిలీకోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురువుతున్నాయి. ప్రత్యేకించి ‘పరస్పర’ అంగీకార కేసుల్లోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఉద్యోగులు తమ స్థానంలో వచ్చేందుకు పొరుగు రాష్ట్రం నుంచి ఫలానా ఉద్యోగి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడం లేదు. బదిలీల విషయంలో నిబంధనలను సడలించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 1. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఆమ్రపాలి దంపతులు
 2. అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణం: నారాయణ
 3. ‘కాంగ్రెస్ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి’
 4. ‘‘ఇదిగో మరో దోపిడీ.. రూ.5 వేల కోట్ల గోల్‌మాల్..!’’
 5. క్రికెట్ ఆడిన రాష్ట్రపతి కోవింద్...
 6. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ పురుషోత్తమరెడ్డిని విచారించిన ఏసీబీ
 7. సంచలనం: రెండో భర్త సాయంతో తొలి భర్తను హత్య చేసిన మహిళ.. సినిమాను తలపించే స్టోరీ!
 8. ‘జగన్‌ అవినీతిపై జాతీయస్థాయిలో చర్చజరుగుతోంది’
 9. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ ఉద్యోగులతో చర్చలు సఫలం
 10. బాచుపల్లి భూకుంభకోణం కేసులో ముగ్గురు అరెస్ట్‌
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.