ADVT
విభజనతో ఏపీకి అన్యాయం
10-02-2018 02:49:21
  • ఉద్యోగుల వల్లే పెరిగిన వృద్ధి రేటు: సీఎస్‌ దినేశ్‌ 
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 9: విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఉద్యోగుల నిరంతర కృషివల్లే రాష్ట్ర వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెరిగిందని అన్నారు. 5వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతికోత్సవాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సీఎస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. నిరంతర సమీక్షలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఏపీఆర్‌ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రస్తావించగా, నిరంతర సమీక్షల వల్ల ప్రజలకు సేవలు మెరుగుపడతాయని సీఎస్‌ బదులిచ్చారు. అయితే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవని, దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. 13 జిల్లాలకు చెందిన రెవెన్యూ క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి సీఎ్‌సకు గౌరవవందనం చేశారు. మార్చ్‌ఫా్‌స్టలో విజయనగరం, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.