ADVT
బాబ్రీ మసీదు.. మరో చోటికి!
10-02-2018 02:35:51
  • తరలిద్దామన్న ముస్లిం బోర్డు సభ్యుడు..
  • రవిశంకర్‌తో భేటీలో సూచన
బెంగళూరు, ఫిబ్రవరి 9: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కీలక మలుపు తిరిగింది. బాబ్రీ మసీదును వేరే చోటకు తరలిద్దామని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సభ్యుడు మౌలానా సయ్యద్‌ సల్మాన్‌ హుస్సేనీ నద్వీ ప్రతిపాదించారు. మసీదు తరలింపునకు ఇస్లాంలో నిబంధనలు అంగీకరిస్తున్నాయని చెప్పారు. ఈ వివాదానికి కోర్టు వెలుపల సామరస్య పరిష్కారానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌(ఏవోఎల్‌) వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ శుక్రవారం బెంగళూరులో మౌలానా నద్వీ సహా ఆరుగురు ముస్లిం ప్రముఖులతో సమావేశమయ్యారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతు తెలిపిన నద్వీ .. మసీదు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరారు. కాగా కోర్టు వెలుపల పరిష్కారానికి రవిశంకర్‌ను కలిసిన ప్రముఖులంతా మద్దతు పలికారని ఏవోఎల్‌ వెల్లడించింది. మార్చిలో మళ్లీ భేటీ కావాలని రవిశంకర్‌ నిర్ణయించారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.