ADVT
లోయా మృతిపై సిట్‌ వేయాలి
10-02-2018 02:27:21
 • నిజాలు తేల్చాల్సిందే
 •  సీబీఐ జడ్జి లోయా మృతిపై విపక్షాల ఐక్యగళం
 •  సిట్‌ విచారణ జరపాలని రాష్ట్రపతికి 114 మంది విపక్ష ఎంపీల వినతి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సీబీఐ జడ్జి బీహెచ్‌ లోయా అనుమానాస్పద మృతిపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించి.. విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 114మంది విపక్ష ఎంపీలు తమ సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి శుక్రవారం అందజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో 15 రాజకీయ పక్షాల నేతలు రాష్ట్రపతిని కలిసి.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సి ఉందని ఆయనకు విన్నవించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, డీఎంకే, ఆప్‌, ఎస్‌పీ, ఎన్‌సీపీ, ఆర్జేడీ లతో పాటు మరికొన్ని పార్టీల ఎంపీలూ సంతకాలు చేశారు. బీఎస్పీ మాత్రం సంతకం చేయలేదు. ‘‘జడ్జి లోయా మృతిపై అనేక సందేహాలున్నాయి.. ఆయనొక్కరే కాదు. తనకు బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తున్నాయని లోయా ఇద్దరు వ్యక్తులకు చెప్పారు. వారు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.
 
వారిలో ఒకరు న్యాయవాది శ్రీకాంత్‌ ఖందాల్కర్‌. 2015లో డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆరో అంతస్తు నుంచి జారి పడి మృతి చెందారు. రెండో వ్యక్తి జిల్లా జడ్జి ప్రకాష్‌ తాంబ్రే! 2016లో ఆయన రైల్లో ప్రయాణిస్తుండగా పైబెర్తు నుంచి జారి పడి.. వెన్నుపూస విరిగిపోయి మరణించారు. ఈ మరణాలకూ లోయా మృతికీ సంబంధం ఉందన్నది అనేకమంది అనుమానం’’ అని సీనియర్‌ లాయర్‌, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ మీడియాకు తెలిపారు. సిట్‌ విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ఉగ్రవాది సొహ్రబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌బీ, స్నేహితుడు తులసీరామ్‌ ప్రజాపతి వేరువేరు చోట్ల ఎన్‌కౌంటర్లలో మరణించిన కేసులను విచారిస్తున్న సమయంలో- 2014లో నాగ్‌పూర్‌లో ఓ వివాహానికి వెళ్లిన లోయా అక్కడే గుండెపోటుతో మరణించారు. సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఒక నిందితుడు.
 
లోయా మరణించిన వారం రోజులకే- ఆయన స్థానంలో వచ్చిన కొత్త జడ్జి- అమిత్‌ షా ను నిర్దోషిగా విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. అదీగాక- లోయాకు అనేక బెదిరింపులు వచ్చాయని, ఆయన మానసికంగా చాలా కలత చెందారని, ఖచ్చితంగా ఆయనది సహజమరణం కాదని లోయా సోదరి- కారవాన్‌ అనే మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూ మొత్తం కథను తిరగదోడింది. అమిత్‌ షా మీద అందరి దృష్టీ పడింది. తన తండ్రిది సహజమరణమేనని, తాము దాన్ని గుండెపోటుగానే భావిస్తున్నామని లోయా కుమారుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ - కేసు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
 
దీనిపై రెండు ప్రజాహిత దావాలుదాఖలయ్యాయి. కాంగ్రెస్‌ ఈ అంశాన్ని పూర్తిస్థాయిలో ప్రచారాస్త్రం చేయాలని నిర్ణయించుకొని దాడిని ముమ్మరం చేయడంతో ఇది ఇంకా కీలకంగా మారింది. లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై సిట్‌ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ కూడా దాఖలయ్యింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ శుక్రవారం నాడే విచారణకు స్వీకరించింది.
 
విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. లోయా పోస్ట్‌మార్టమ్‌ నివేదికను తమకు అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. లోయా మృతిపై స్వతంత్ర విచారణ లేదా సిట్‌ చేత దర్యాప్తు జరపాలంటూ దాఖలైన ప్రజాహిత దావాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Advertisement

 1. అఖిలేశ్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి... 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు...
 2. ఎన్ఐఏ చేతికి చిక్కిన జంట పేలుళ్ల నిందితుడు
 3. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ప్రధాని మోదీ రాలేదు: బీజేపీ
 4. రక్తంతో శివకుమార స్వామి భావచిత్రం
 5. భార్య తీరుపై అనుమానంతో హత్య చేసి ఉరేసుకున్న భర్త!
 6. ఇద్దరు మంత్రుల వ్యాఖ్యలు: రాజీనామాకు నేను సిద్ధం.. నేనెందుకు రాజీనామా చేయాలి?
 7. సీఎంకంటే ఆడవాళ్లు నయం.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
 8. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల నివాసాలకు పటిష్ట భద్రత
 9. కర్ణాటకలో మళ్లీ జోరందుకున్న ఆపరేషన్ కమలం.. కాంగ్రెస్‌లో కలవరం
 10. ఇంద్రాణీ నన్ను తప్పుదోవ పట్టించింది: పీటర్ ముఖర్జియా

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.