ఏమిచ్చిందో కేంద్రం చెప్పాలి!
10-02-2018 02:26:11
  • ఏపీ మంత్రుల డిమాండ్‌ 
ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ర్టానికి సాయం చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై పలువురు మం త్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇచ్చిన నివేదికలకు, కేంద్రం ప్రకటించిన నిధులకు ఎక్కడా పొంతన లేదని మంత్రి జవహర్‌ అన్నారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌తోపాటు విభజన సమయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి అమరనాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుమలలో శ్రీ వారిని దర్శించుకున్న అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకున్న మరో మంత్రి కొల్లు రవీంద్ర... ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ పాత విషయాలనే ప్రస్తావించారన్నారు. కేసులను తొలగించుకోవడం కోసం ప్రతిపక్ష నేత జగన్‌ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేందుకు కొత్తగా వచ్చే జేఏసీలతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా వ్యవహరిస్తున్నార ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మండిపడ్డారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి ప్రసంగానికి విజయసాయి అడ్డుపడటం ఆపార్టీ ద్వం ద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కాగా, బీజేపీ దిగిరాకుంటే స్నేహ బంధాన్ని తెంచుకు నేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఉప ముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తి అనపర్తిలో అన్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.