ADVT
భారత్‌కు కచ్చిత సమయం!
10-02-2018 02:22:32
  •  100కోట్లతో త్వరలో ప్రాజెక్టు: కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: భారత ప్రామాణిక కాలమానం (ఐఎ్‌సటీ).. భారతీయులంతా పాటించే సమయం. కానీ, ఏది కచ్చిత సమయమో ఇప్పటికీ సరిగా తెలీదు. రైల్వే స్టేషన్‌కు వెళితే ఒకలా.. బ్యాంకులకు వెళితే మరోలా.. వాతావరణ శాఖకు వెళితే ఇంకోలా.. టీవీ చానళ్లలో వేరేలా ఉంటాయి. వాటిని పోల్చి చూస్తే కనీసం ఐదు నుంచి పది నిముషాల వ్యత్యాసం ఉంటుంది. దీని వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించిన కేంద్రం ఐఎ్‌సటీ కచ్చిత సమయాన్ని దేశవ్యాప్తంగా ఒకేలా చేసేందుకు రూ.100కోట్లతో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఐదు ప్రాంతీయ ల్యాబ్‌ (అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, ఫరీదాబాద్‌, గువహటి)లలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనుంది. కొత్తగా మరో రెండు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించారని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయం దేశభద్రతకు, సైబర్‌ నేరాల దర్యాప్తునకు ఉపయోగపడుతుందని చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.