మే 6న ‘నీట్‌’
10-02-2018 02:21:21
  • నోటిఫికేషన్‌ విడుదల.. జూన్‌ 5వ తేదీన ఫలితాలు
  • శుక్రవారం నుంచి అందుబాటులో దరఖాస్తులు
అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీ ససీ) శుక్రవారం నీట్‌ - 2018 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మే 6న నీట్‌ పరీక్షను నిర్వహించనుంది. జూన్‌ 5న పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లిష్‌, హిందీతో పాటు తొమ్మిది భాషాల్లో ప్రశ్న పత్రాన్ని అందించనుంది. అభ్యర్థులు దరఖాసు సమయంలోనే వారి భాషను ఎంపిక చేసుకోవచ్చు. 12వ తరగతి పాసైన వారు నీట్‌ రాయడానికి అర్హులు. 17-25 మధ్య వయసువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. జనరల్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.1400 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులను మార్చి 9 వరకు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. దరఖాస్తులో మార్పులకు నాలుగు రోజులు (మార్చి 12-16) అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌ రెండో వారంలో హాల్‌టికెట్లును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.