ADVT
ఇంట్లో మొక్కను నాటి చూడు..
10-02-2018 02:10:19
మొక్కలతో ఇంటికి ఎంత అందం వస్తుందో అంతకు మించి మేలు కూడా జరుగుతుంది. మనిషి మనుగడకు అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్‌) మొక్కల నుంచే విడుదలవుతుంది. అందుకే మొక్కలున్న ఇల్లు అందంగా ఉంటుంది. మొక్కలు లేని లేని ఇంట్లో కళ కనిపించదు. అపార్ట్‌మెంట్స్‌లో ఉండే వారు కూడా కుండీలలో మొక్కలను పెంచుకుంటారు. నగరంలో పెరిగిపోతున్న కాలుష్యం నుంచి మనల్ని కాపాడుకునేందుకు, పచ్చదనంతో వేసవికాలంలో హాయిని పొందేందుకు అవి ఎంతో దోహదం చేస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లలో ఈ మధ్య మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విల్లా టౌన్‌షి్‌పలో మేజర్‌ఫార్ట్‌ గార్డెనింగ్‌దే. అద్బుతమైన గార్డెన్స్‌ లేనిదే ఎవరు విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు కొనడం లేదు. ఆవి ఎంత బాగా ఉంటే అంత ఇల్లు అంతబాగా ఉన్నట్లు అనే భావన కొనుగోలుదారుల్లో ఉంది.
 
అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ చుట్టూ ఉన్న స్థలంలోనూ, ఇండిపెండెంట్‌ ఇళ్లలోనూ మొక్కలను పెంచడం వల్ల భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. వేసవిలో బోర్‌ బావులు ఎండి పోయే సమస్యలు తగ్గుతాయి.
 
కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది. శబ్ద కాలుష్యంను చాలా వరకు తగ్గిస్తాయి. పొగను, దుమ్ముధూళిని చెట్ల ఆకులు ఆకర్షిస్తాయి. వర్షం వచ్చినపుడు ఆ దుమ్మును నేలపైకి వదులుతుంది.
 
మొక్కలను పెంచేందుకు అనుభవంతో పనిలేదు. ఇళ్లలో స్థలం ఇరుకుగా ఉంటే బోన్సాయ్‌ చెట్లను పెంచుకోవచ్చు. కనీసం 0.5 మీటర్ల ఎత్తుగల మొక్కలను నాటడం ఉత్తమం.
 
వేప, అల్లనేరేడు, జామ, సపోటా, కరివేప, ఉసిరి, మామిడి, మునగ, బొప్పాయి, కొబ్బరి చెట్లు ఇంట్లో నాటుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వేప, అల్లనేరేఏడు మొక్కలు పెరిగిన తర్వాత చల్లగాలిని ఎక్కువ ఇస్తాయి. ఈ గాలి ఆరోగ్యానికి మంచిది.
కలబంద, తులసి, బంతి, ఇంగ్లీష్‌ ఐవీ, మనీప్లాంట్‌, వీపింగ్‌ ఫిగ్‌, స్నేక్‌ప్లాంట్‌వంటివి ఇండోర్‌లో, బాల్కనీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి.మొక్కలకు ఆర్గానిక్‌ ఎరువులను, క్రిమిసంహారాలను ఉపయోగించాలి.
దీనివల్ల ఇంట్లో వాళ్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
ప్రాణవాయువును నింపిన మూడు మొక్కలు
ఇండోర్‌లో పెంచే మూడు మొక్కలు ఇంట్లోని గాలిలో ఆక్సిజన్‌ శాతాన్ని ఏ విధంగా పెంచాయో టెడ్‌ టాక్‌లో ఒకరు ప్రత్యక్ష అనుభవంతో వివరించారు. ప్రయోగాత్మకంగా ఆయన ఎంచుకున్న మూడు మొక్కలు మనీప్లాంట్‌, అరెకాపామ్‌, స్నేక్‌ ప్లాంట్‌. ఇందులో అరెకాపామ్‌ కార్బన్‌డైయాక్సెడ్‌ను స్వీకరించి దానిని ఆక్సిజన్‌గా మార్చి విడుదలచేస్తుంది. గాలిలో కార్బన్‌డైయాక్సైడ్‌ శాతాన్ని తగ్గించడంతో పాటు గాలిలోని కొన్ని రకాల కాలుష్యకారకాలను పరిహరించే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. అమెరికాలో విరివిగా కనిపించే ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌లో మదర్‌ ఇన్‌లా టంగ్‌గా వ్యవహరించే సన్సెవెరియా ట్రైఫాషిటా ఒకటి. ఈ మొక్కను బెడ్‌రూమ్‌లో ఒక మూల ఉంచొచ్చు. ఎందుకంటే ఇది రాత్రిళ్లు ఆక్సిజన్‌ను విడుదలచేస్తుంటుంది. దీనిని స్నేక్‌ ప్లాంట్‌ అని కూడా వ్యవహరిస్తారు. గాలిలో నుంచి బెంజిన్‌ను తొలగించే గుణం ఈ మొక్కకు ఉందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు మొక్కలకు బెస్ట్‌ కాంబినేషన్‌గా మనీప్లాంట్‌ను చెబుతారు. గాలిలోని రసాయనాలు, ఇతర కాలుష్యాలను పరిహరించడంలో మనీ ప్లాంట్‌ అమోఘంగా పనిచేస్తుంది. ఈ ప్లాంట్స్‌ను పెంచుకునే ముందు గమనించాల్సిన విషయం ఒకటుంది. ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకునేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్నేక్‌ప్లాంట్‌, మనీప్లాంట్‌లను తింటే పెట్స్‌కు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. - నార్సింగ్‌

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.