రాబోయే బేర్‌ మార్కెట్‌ అత్యంత దారుణం
10-02-2018 01:55:01
రాబోయే బేర్‌ మార్కెట్‌ అత్యంత దారుణంగా ఉంటుందని, తాను ఇంతవరకు జీవితకాలంలో చూడనంత ఘోరం గా ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్టర్‌, 75 సంవత్సరాల వయోవృద్ధుడు జిమ్‌ రోగర్స్‌ హెచ్చరించారు. అయితే మార్కెట్‌ ఇప్పటికిప్పుడే బేరిష్‌ అవుతుందా అన్నది ఆయన చెప్పలేదు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికాలో డెట్‌ భారీగా పేరుకుపోవడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు. ఒక్కరోజు విరామం ఇచ్చినట్టుగా కనిపించిన ప్రపంచమార్కెట్‌లో తిరిగి అమ్మకాలు హోరెత్తడంలో కూడా ఆశ్చర్యం లేదని, ఈ తిరోగమనం మరింతగా కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు. జీవితకాలంలో తాను ఎన్నో బేర్‌ మార్కెట్లు చూశానని, కాని రాబోయే బేరిష్‌ ట్రెండ్‌ అన్నింటికన్నా దారుణంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచే వరకు మార్కెట్లలో ఈ ఆటుపోట్లు తప్పవని, ఆ తర్వాత తిరిగి పురోగమనం మొదలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.