ADVT
తెలంగాణలో టఫే ‘జెఫార్మ్‌’
10-02-2018 01:28:40
  • 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు యోచన
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకతతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నట్టు ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్వి్‌పమెంట్‌ లిమిటెడ్‌ (టఫే) ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (ప్రొడక్ట్‌ స్ర్టాటజీ, కార్పొరేట్‌ సంబంధాలు) టిఆర్‌ కేసవన్‌ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో జెఫార్మ్‌ను ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్నామని, దీని విస్తీర్ణం 50 హెక్టార్లు ఉంటుందని కేసవన్‌ శుక్రవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనికి కనీసం 50 కోట్ల రూపాయల అవసరం ఉంటుందని చెప్పారు. జెఫార్మ్‌ ఏర్పాటు కోసం ములుగు, రాజన్న సిరిసిల్లా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో స్థలాలను పరిశీలించినట్టు చెప్పారు. జెఫార్మ్‌ ద్వారా రైతులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు, విభిన్న రకాల పంటల సాగు, తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగు గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే చెన్నైలో 200 ఎకరాల విస్తీర్ణంలో జెఫార్మ్‌ను నిర్వహిస్తున్నామని, రాజస్థాన్‌, అసోమ్‌, కర్ణాటకలో జెఫార్మ్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా జెఫార్మ్‌ ద్వారా రైతులకు సహకారం అందిస్తున్నామన్నారు.
 
ఉపకరణాల ప్లాంట్‌
తెలంగాణలో 30 ఎకరాల విస్తీర్ణంలో హైఎండ్‌ ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌ (ఉపకరణాలు) ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచన కూడా ఉందని కేసవన్‌ తెలిపారు. ఈ ప్లాంట్‌ కోసం 100-200 కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుందన్నారు. ఈ ప్లాంట్‌లో తయారు చేసే ఉపకరణాల ద్వారా ఉత్పాదక వ్యయాన్ని, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు. ఈ మేరకు నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
 
ఫార్మర్‌2ఫార్మర్‌ విస్తరణ
ట్రాక్టర్‌ ఇతర వ్యవసాయ యంత్రాలు కలిగిన రైతులు, వాటి అవసరం ఉన్న రైతులకు ప్రయోజనం కల్పించే ఫార్మర్‌ 2 ఫార్మర్‌ సదుపాయాన్ని తెలంగాణకు విస్తరించనున్నట్టు కేసవన్‌ తెలిపారు. మొబైల్‌ యాప్‌ ఆధారంగా రైతులు తమ వద్ద వినియోగంలో లేని యంత్రాలను ఇతర రైతులకు అద్దెకు ఇవ్వవచ్చని చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.