ADVT
వచ్చే జనవరిలో గజ్వేల్‌కు రైలు
10-02-2018 00:51:35
  • యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తికావాలి..
  • రైల్వే అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌
  •  వర్షం కోసం మొగులుకేసి చూసే రోజులుండవు
  •  గజ్వేల్‌లో ప్రతి చెరువుకూ గోదావరి నీరు: హరీశ్‌
హైదరాబాద్‌/గజ్వేల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరిలోగా గజ్వేల్‌కు రైలు నడవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకోసం మనోహరాబాద్‌- కొత్తపల్లి రైల్వే లైన్‌ పనులను యుద్థ ప్రాతిపదికన పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. రైల్వే లైన్‌, రైల్వే ేస్టషన్ల నిర్మాణం, ఇతర పనుల పురోగతిపై శుక్రవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని తన బంగళాలో మంత్రి సమీక్షించారు. ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న భూేసకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. తూప్రాన్‌ మండలం పరికిబండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న భూముల ేసకరణకు అడ్డంకులు తొలగిపోయాయని, మెదక్‌-అక్కన్నపేట మార్గంలో భూేసకరణను పూర్తి చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ అంచనా కన్నా నెమ్మదిగా రైల్వే పనులు సాగుతున్నట్లు మంత్రి అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు గజ్వేల్‌ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున.. రైల్వే లైన్‌ పనులు వేగం పుంజుకోవాలని సూచించారు. సిద్దిపేట, గజ్వేల్‌ రైల్వే ేస్టషన్‌ భవనాలను అత్యాధునికంగా నిర్మించాలని కోరారు. కాగా మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలు మార్గానికి సంబంధించి భూేసకరణ దాదాపు పూర్తి కావచ్చిందని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, రైల్వే సీఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, గజ్వేల్‌ మండలంలోని ప్రజ్ఞాపూర్‌ ఊర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హశ్‌శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గజ్వేల్‌ నియోజకవర్గంలోని 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని, మిషన్‌ కాకతీయలో భాగంగా ఇప్పటికే చెరువులన్నీ మరమ్మత్తులు చేశామని తెలిపారు. గజ్వేల్‌ను అంతర్గత రోడ్లు, ఇంటింటికీ కుళాయి నీటితో అద్దంలా మారుస్తామన్నారు.

సుబాబుల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: టీడీపీ-టీఎస్‌
రాష్ట్రంలోని సుబాబుల్‌, జామాయిల్‌ రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టన్నుకు రూ.5500 ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీటీఎస్‌ నేతలు మంత్రి హరీశ్‌రావును కోరారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు శుక్రవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఒక్క ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోనే దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో సుబాబుల్‌, జామాయిల్‌ సాగవుతోందని మంత్రి దృష్టికి తెచ్చారు. బీపీఎల్‌ కంపెనీతో మాట్లాడి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని వారు కోరారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.