ADVT
15 రోజుల్లో కేంద్రం నుంచి ఏపీకి శుభవార్త!
09-02-2018 23:19:33
న్యూ ఢిల్లీ: ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీల విషయంపై శుక్రవారం సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రం నుంచి ఎట్టకేలకూ శుభవార్త అందింది. అన్ని విధాలా ఏపీని ఆదుకుని.. నిధులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
 
శుక్రవారం జరిగిన చర్చల గురించి టీడీపీ ఎంపీ తోట నరసింహం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. "శుక్రవారం సాయంత్రం సుజనా చౌదరి కేంద్ర మంత్రులతో రెండున్నర గంటలపాటు చర్చించారు. ముఖ్యంగా రైల్వేజోన్, డెఫిసియట్ బడ్జెట్, పోలవరం నిధుల విషయంపై నిశితంగా చర్చించారు. రాబోయే పదిహేను రోజుల్లో పూర్తిగా నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం చెప్పింది. రెండో దఫా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే ఏపీకి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని సుజనాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. రేపట్నుంచి 15రోజుల్లోపే కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే దిశగా కార్యాచరణ ఉంటుంది. ఇదే విషయాన్ని మా సీఎం చంద్రబాబు కూడా చెప్పారు" అని తోట నరసింహం ఏబీఎన్‌కు వివరించారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.