మా పోరాటం ఫలించింది.. చంద్రబాబే మార్గదర్శనం చేశారు: సీఎం రమేశ్
09-02-2018 22:48:05
ఢిల్లీ: కేంద్ర నుంచి ఆశాజన ఫలితాలు వచ్చాయన్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్. రెవెన్యూ లోటును త్వరలో రిలీజ్ చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తమతో చెప్పినట్టు రమేశ్ తెలిపారు. ఆయన ఇంకేమన్నారంటే.. "సభ ముగిసిన వెంటనే నేను, మంత్రి సుజనా చౌదరి జైట్లీ దగ్గరికి వెళ్లి చర్చించాం. ఫైళ్లు తీసుకుని రమ్మన్నారు. వాటిని చూసిన తర్వాత రెవెన్యూలోటు, పోలవరంలపై స్పష్టత ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కూడా సమావేశమయ్యాం. రైల్వేజోన్, దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై మాట్లాడారు. పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనతో ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు మార్గదర్శనంతోనే ఇది సాధ్యమైంది. పార్లమెంటులో మా ఎంపీలు చేసిన పోరాటం ఫలించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆందోళనలు చేశాం. అయితే ప్రకటనలు కాదని.. వాస్తవ రూపంలోకి వస్తేనే నమ్మకం కలుగుతుందని కేంద్రానికి తెగేసి చెప్పాం. శనివారం ఎంపీలందరం మళ్లీ చర్చించి... ఏం చేయాలన్నదానిపై నిర్ణయిస్తాం" అని తమకు వివరించినట్లు సీఎం రమేష్ ఏబీఎన్‌కు తెలిపారు.
Tags : cm ramesh, Arun Jaitley, sujana choudary, Andhra Pradesh
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.