ఒమన్‌లో 200 ఏళ్ల నాటి శివాలయం.. సందర్శించనున్న మోదీ
09-02-2018 22:18:41
old యూఏఈ: ప్రధాని మోదీ అరబ్ దేశాల పర్యటనలో బిజీగా ఉన్నారు. పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో పర్యటించనున్నారు. తొలుత ఇవాళ జోర్డాన్‌ చేరిన మోదీ.. అక్కడి నుంచి పాలస్తీనా చేరారు. పాలస్తీనాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఇదిలా ఉంటే.. ఈ టూర్‌కు చారిత్రక ప్రాధాన్యముంది. యూఏఈలోని అబుదాబిలో ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. అబుదాబిలో ఓ హిందూ ఆలయం నిర్మాణం జరగడం ఇదే తొలిసారి. మొత్తం 13.6 ఎకరాలలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఎన్నో ఏళ్ల స్వప్నం ఫలించిందని.. ప్రధాని మోదీ చరిష్మాతోనే ఇది సాధ్యమంటున్నారు స్థానికులు. 2020 కల్లా నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఢిల్లీలోని అక్షర్ ధామ్ తరహాలో శిలతో నిర్మాణం చేస్తామని తెలిపారు.
 
మరోవైపు ఒమన్‌లోనూ చారిత్రక శివాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ముత్రాహ్‌లో ఉండే ఈ శివాలయాన్ని గుజరాతీ వ్యాపారులు నిర్మించారు. 2015లో మోదీ దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆలయ సందర్శనకు రమ్మని స్థానికులు ఆహ్వానించారు. దీంతో శివాలయ సందర్శనకు ప్రధాని వెళుతున్నారు. ఈ ఆలయంతో పాటు ఒమన్‌లోని అతిపురాతన మసీదును కూడా దర్శించనున్నారు.
Tags : oman, shiva temples, historical temple
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.