యాంకర్ ప్రదీప్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ రీట్వీట్..
09-02-2018 21:59:17
హైదరాబాద్: టీవీ యాంకర్ ప్రదీప్ ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమస్యలను యాంకర్ ప్రదీప్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్‌కు సూచించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించి తనకు తెలియజేయాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చర్లపల్లి ప్రాథమిక పాఠ‌శాల‌లో బాత్రూమ్ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని యాంకర్ ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలో మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల సమస్యలపై మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.