సెల్ఫీలు వద్దమ్మా.. ఆట సంగతి చూడు!
09-02-2018 21:15:29
సౌతాఫ్రికా: ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ట్వీట్ విమర్శల పాలవుతోంది. అతను ట్వీట్ చేసిన సెల్ఫీపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆటపై దృష్టి పెట్టాలికానీ.. ఇలాంటివి ఎందుకంటూ ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. టీమ్‌లోకి తీసుకుంది ఆట ఆడటం కోసం కానీ.. సెల్ఫీల కోసం కాదని విమర్శిస్తున్నారు.   సౌతాఫ్రికాలో టూర్‌లో భాగంగా టీమిండియా.. ఆరు వన్డేల సిరీస్‌ ఆడుతోంది. దీనిలో మూడు వన్డేలు గెలిచి.. ఆధిక్యంలో ఉంది. అయితే నాలుగో వన్డే కోసం కేప్‌టౌన్ నుంచి జోహన్నెస్‌బర్గ్ వెళ్ళారు.
 
అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఆటవిడుపుగా.. ఎంఎస్ ధోని, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, అక్షర్ పటేల్‌లతో కలిసి పాండ్యా ఫొటో దిగాడు. దాన్ని ట్వీటర్‌లో పోస్ట్ చేశాడు. కేప్‌ టౌన్‌లో ముగిసింది.. జొహన్నెస్‌బర్గ్‌కు మళ్లీ వెళ్తున్నామంటూ పాండ్యా తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీనిపైనే నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వన్డే సిరీస్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించని పాండ్యా.. సెల్ఫీలు దిగి పోస్టులు పెట్టడం అభిమానులకు అంతగా రుచించలేదు. ఇక ఆపు.. ఎక్కువ చేయకు అంటూ ట్వీట్లు చేశారు. 
Tags : INDIA, Cricket, Hardik Pandya, Selfie
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.