ADVT
టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు ఫోన్‌.. ఏం మాట్లాడారంటే?
09-02-2018 20:25:28
ఢిల్లీ: టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు ఫోన్‌ చేశారు. విభజన హామీలపై నిర్ధిష్ట కాలప్రకటన వచ్చేవరకు పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని ఆదేశించారు. గురువారం దుబాయ్‌ నుంచి ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోక్‌సభలో జైట్లీ ప్రకటనతో సీఎం చంద్రబాబు అసంతృప్తి చెందిన విషయం తెలిసిందే. కేంద్రం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాలతో టీడీపీ ఎంపీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయిదు రోజులుగా నిరసనల ఉధృతి పెంచారే తప్ప.. తగ్గించలేదు.
 
స్పీకర్ సుమిత్రా మహాజన్ వారించినా, కేంద్ర మంత్రులు సర్దిచెప్పాలని చూసినా వెనకడుగు వేయలేదు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తానికి తెలియజేశారు. అయితే శుక్రవారం పార్లమెంట్‌లో జైట్లీ రాజ్యసభలో ఏపీకి మొండిచేయి చూపించారు. జైట్లీ మరోసారి ఏపీ సమస్యలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని ఎంపీలకు ఆదేశించారు.
Tags : Chandrababu, Cellphone, TDP, mps

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.