బ్రేకింగ్: మాల్దీవుల్లో ఇద్దరు భారతీయ రిపోర్టర్ల అరెస్టు
09-02-2018 20:11:25
మాలే: మల్దీవుల్లో 15 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించడంతో పరిస్థితులు అంతకంతకూ విషమిస్తున్నాయి. ఏఎఫ్‌బీ న్యూస్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ రిపోర్టర్లను మాల్దీవుల్లో అరెస్టు చేశారు. అమృత్‌సర్‌కు చెందిన మనీశర్మ, లండన్‌కు చెందిన రిపోర్టర్ అతిష్ రాజీవ్ పటేల్‌ను మాల్దీవియన్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్రీ కింద 'జాతీయ భద్రతా ప్రయోజనాల' పేరుతో అరెస్టు చేశారు.
 
అసమ్మతివాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటం, బెదరింపులకు పాల్పడుతుండటంతో విపక్ష అనుకూల టెలివిజన్ నెట్‌వర్క్ రాజ్జే టీవీని మూసేశారు. ప్రభుత్వ లెజిస్టేటర్లు, ఇతరుల నుంచి తమకు బెదరింపులు వస్తున్నట్టు విపక్ష నేత ఇవా అబ్దుల్లా ఆరోపించారు. ప్రతీకార రాజకీయాల కారణంగా అరెస్టు చేసిన రాజకీయ నేతలను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధ్యక్షుడు అబుద్లా యమీన్ వ్యతిరేకించడం, తీర్పునిచ్చిన జడ్జీల అరెస్టుకు ఆదేశిస్తూ 15 రోజుల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధంచడంతో దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.