న్యూ ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? అని కేంద్రాన్ని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆమె.. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఇదే సభలో అందరూ ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
విభజన సమయంలో ఇదే సభలో హామీలిచ్చాం.. అమలు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏంటి? అని రేణుకా చౌదరి ప్రశ్నల వర్షం కురింపించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడమే మానేసిందన్నారు. కాగా ఇదివరకే టీఆర్ఎస్ ఏపీ ఎంపీల నిరసన మద్దతు తెలిపింది. విభజన హామీలన్నీ అక్షరాలా అమలు చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు. తాజాగా కాంగ్రెస్ కూడా ఏపీకి మద్దతిచ్చి కేంద్రంపై మాటల యుద్ధం ప్రారంభించింది.