ఏపీ గురించి నాలుగే నాలుగు వాక్యాల్లో...!: జైట్లీ
09-02-2018 19:38:30
న్యూ ఢిల్లీ: లోక్‌‌సభలో ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రాజ్యసభలో అయినా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రకటన చేస్తారని ఏపీ ఎంపీలు, ప్రజలు వేయికళ్లతో వేచి చూశారు. అయితే తీరా జైట్లీ ప్రకటన చూస్తే ఎలాంటి ప్రకటన లేకపోగా లోక్‌సభలో చెప్పిందే ‘సేమ్‌‌ టూ సేమ్‌’‌ పొల్లుపోకుండా దింపేశారు. నాలుగే నాలుగు వ్యాక్యాల్లో ఏపీ డిమాండ్లపై తన స్పందనను జైట్లీ ముగించేశారు.
 
ఏపీకి సంబంధించి జైట్లీ ప్రకటన ఇదీ..(ఫుల్ స్పీచ్)
  • రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయంకోసం మేం కూడా పోరాడాము.
  • విభజనతో ఏపీ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమే.
  • మొదటి ఏడాది రెవెన్యూ లోటు భర్తీకి రూ.3979 కోట్లు ఇచ్చాం.. మిగతా సాయంపై చర్చలు జరుపుతున్నాం.
  • రైల్వేజోన్, దుగ్గరాజుపట్నం పోర్ట్, విశాఖ-చెన్నై కారిడార్ స్టీల్‌ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించాం.
  • ఏపీకి సాయంపై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నాం.
  • రాజధాని, పోలవరం నిర్మాణం కోసం నిధులిచ్చాం.
  • పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.
  • ఇప్పటికే ఇచ్చాం, ఇంకా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.
  • కేంద్ర విద్యా సంస్థల్ని ఏపీలో ఏర్పాటు చేస్తాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేశాం అని ఏపీ గురించి తన ప్రసంగాన్ని ముగించేశారు. 
అయితే ఏపీ చేస్తున్న డిమాండ్లపై మాత్రం ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఏపీ ఎంపీల ఆందోళలను ఏమాత్రం పట్టించుకోకుండా తను మాట్లాడాలనుకున్నది మాట్లాడేసి ప్రసంగాన్ని ముగించేశారు.
Tags : Arun Jaitley, Central Govt, Andhrapradesh, Rajyasabha, AP Special Package
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.