అమ్మో బొమ్మ.. ఎంత పని చేశావే
09-02-2018 17:29:55
అమెరికా: బొమ్మ కోసం వెళ్లిన ఓ బాలుడు.. టాయ్ మెషీన్‌లో ఇరుక్కుపోయాడు. అక్కడున్న ఓ పోలీస్ ఆఫీసర్ అది గమనించి.. రెస్క్యూ టీమ్‌ను పిలిచి నిమిషాల వ్యవధిలో అతన్ని రక్షించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల మ్యాషన్ తల్లితో పాటు ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తల్లి కౌంటర్ దగ్గరకు వెళ్లగా.. మ్యాషన్ మాత్రం బొమ్మల కోసం టాయ్ మెషీన్ దగ్గరకు వెళ్లాడు. అయితే అక్కడ మనోడికి ఓ బొమ్మ తెగనచ్చేసింది. దానికోసం మెషీన్‌ లోపలికి దిగి.. దాన్ని పట్టుకున్నాడు. దిగడమైతే దిగాడు కానీ.. ఎలా బయటకు రావాలో మ్యాషన్‌కు అర్థం కాలేదు. దీంతో ఏడుస్తూ కూర్చున్నాడు. అక్కడే ఉన్న ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ దీన్ని గమనించి.. ఉన్నతాధికారులకు సమాచారమందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ 10 నిమిషాల్లోనే అతన్ని క్షేమంగా బయటకు తీసింది. ఈ తతంగాన్ని ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
Tags : florida, toy machine, stuck, Boy
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.