మొబైల్ యాప్స్‌తో ప్రోగ్రామింగ్‌ నేర్చుకోండిలా..!
09-02-2018 12:08:58
సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న వారే కాక డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులు కూడా ఇపుడు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడే వారు యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అటువంటి యాప్‌ల గురించి మీ కోసం..
 
లెర్న్‌ ప్రోగ్రామింగ్‌
ఇది ప్రత్యేకంగా ఇంటరాక్టివ్‌ టెక్ట్స్‌ బుక్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీస్‌ అనే థీసెస్‌కు సంబంధించినది. ఇందులో హెచ్‌టీఎంఎల్‌ 5కు సంబంధించి అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. దీనితో పాటు మరో 30కి పైగా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మీ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు నమూనా ప్రశ్నలు ఇక్కడ ప్రిపేర్‌ అయి ఉంటాయి. యాప్‌ సెట్టింగ్స్‌ను మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్‌ చేసుకోవచ్చు.
 
సీ ప్రోగ్రామింగ్‌
ఈ యాప్‌ ద్వారా సీ ప్రోగ్రామింగ్‌కు సబంధించి నోట్స్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో క్యారీ చేసుకోవచ్చు. దీనిలో 90కి పైగా సీ ప్రోగ్రామ్స్‌ ఉంటాయి. సింపుల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండే ఈ యాప్‌ ద్వారా కంటెంట్‌ను మరింత సులువుగా ఆర్దం చేసుకునే వీలుంటుంది. చాప్టర్‌ వైజ్‌ సీ ట్యుటోరియల్స్‌ ఇక్కడ లభ్యమవుతాయి. ఇదే సమయంలో ముఖ్యమైన ఎగ్జామ్‌ ప్రశ్నలను ఇక్కడ కూడా పొందవచ్చు.
 
ఉడా సిటీ
ఈ యాప్‌లో అందుబాటులో ఉన్న కోర్సులను ఫేస్‌బుక్‌, గూగుల్‌, క్లౌడ్‌ ఎరా, మోంగోడీబి వంటి దిగ్గజ కంపెనీలకు చెందిన నిపుణులు డిజైన్‌ చేశారు. ప్రోగ్రామింగ్‌కు చెందిన బేసిక్స్‌తో పాటు మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ కోర్సులను ఇక్కడ నేర్చుకునే వీలుంటుంది. టిఎంఎల్‌, సిఎస్‌ఎస్‌, జావాస్ర్కిప్ట్‌, పైతాన్‌, జావా ఇంకా ఇతర ప్రోగ్రామింగ్‌ భాషలకు సబంధించి కోడింగ్‌ను నేర్చుకోవచ్చు.
 
ప్రోగ్రామింగ్‌ హబ్‌
ఈ అప్లికేషన్‌లో దాదాపు 1800 వరకు ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటిని 17 కంటే ఎక్కువ భాషల్లో నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్‌ ఇంకా లెర్నింగ్‌ ఈ ప్రోగ్రామ్‌కు ఉపయోగించుకోవచ్చు. హెచ్‌టిఎంఎల్‌, సిఎస్‌ఎస్‌, జావా స్ర్కిప్ట్‌ వంటి ప్రోగ్రామ్‌లను ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ లేకుండా కూడా నేర్చుకోవచ్చు.
 
లెర్న్‌ పైథాన్‌
బాగా డిమాండ్‌ ఉన్న ప్రోగ్రామ్‌ లాగ్వేంజ్‌లలో ఇది ఒకటి. ఈ యాప్‌ ప్రోగ్రామింగ్‌ను సులువుగా నేర్పుతుంది. బేసిక్స్‌తో పాటు డేటా టైప్స్‌, కంట్రోల్‌ స్ట్రక్చర్స్‌, ఫంక్షన్స్‌ అండ్‌ మాడ్యువల్స్‌, ఎక్సెప్షన్స్‌ ఇంకా ఫైల్సు అందుబాటులో ఉంటాయి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.