మైక్రో చీటింగ్‌!
06-02-2018 23:19:02
సోషల్‌ మీడియా పుణ్యమాని ‘మనుషులు దూరమైనా మనసులు దగ్గరే’! అనే ప్రవృత్తి పెరుగుతోంది. గతంలో ముగిసిన అధ్యాయాల్ని మళ్లీ తాజాగా మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ సందేశాలకు సోషల్‌ మీడియా వారధిగా మారిందని ఇటీవలే ఓ అధ్యయనంలో తేలింది. తమ మాజీ ప్రియులు/ప్రియురాళ్లను ఆకర్షించటానికి సోషల్‌ మీడియాతో గాలం వేస్తున్న వారు పెరుగుతున్నారు. వారికి సందేశాలను చేరవేసేందుకు మాజీ ల అకౌంట్ల కోసం సోషల్‌ మీడియాను జల్లెడ పడుతున్నారు. దొరికితే వాళ్ల పాత పోస్టులను పరిశీలిస్తున్నారు. ‘హృదయం’, ‘పువ్వులు’ లాంటి గుర్తులున్న ఎమోజీలను పంపుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అపోజిట్‌ సెక్స్‌ వ్యక్తుల నంబర్లను మారు పేరుతో సేవ్‌ చేసుకుంటున్నారు.
 
అంతేకాదు తరచూ మాజీలను స్నాప్‌ఛాట్‌ మెసేజింగ్‌ సైట్‌లో యాడ్‌ చేసుకోవటం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పెట్టే పోస్ట్‌లను లైక్‌ చేయటం, లాంటి పనులు చేస్తున్నారు. ఇలా చేయటాన్ని ‘హైలెవల్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇంట్రెస్ట్‌’ అంటారు. పాత పరిచయాలను పునరుద్ధరించుకోవాలనే కారణంతో వారిపై డిజిటల్‌ ఇంట్రస్ట్‌ చూపటాన్ని ‘మైక్రో చీటింగ్‌’ గా పరిగణిస్తారు. దీనికే మరో పేరు ‘ఎమోషనల్‌ ఎఫెయిర్‌’. అయితే నిపుణులు మాత్రం ఎదుటివారికి తెలియకుండా ఇలాంటి పనులు చేయటం అనైతికం అంటున్నారు ఇలాంటి వారు తమ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.