ADVT
నేడు అధికారులకు అవార్డుల ప్రదానం
12-01-2018 07:07:59
విజయవాడ: ప్రభుత్వం నిర్దేశించిన అంశాల మేరకు జన్మభూమి- మా ఊరు సమర్థంగా అమలు చేసిన అధికారులను శుక్రవారం అవార్డులు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగు తుందని తెలిపారు. విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి నోడల్‌ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుం దన్నారు. జన్మభూమి నిర్వహణలో అవనిగడ్డ మండలం, పెడన మున్సి పాలిటీ జన్మభూమి అంశాలు అమలులో సరైన ప్రగతిని సాధించలేదని తెలిపారు. ఆయా నోడల్‌ అధికారులు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 పిడుగు బాబూ రావు, విజయవాడ ఆర్డీవో ఎస్‌.హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.
 
డీఆర్‌డీఏ పీడీకి అవార్డు, బంగారు పతకం
జన్మభూమి సమర్థంగా నిర్వహిం చినందుకు వీరులపాడు మండల నోడల్‌ అధికారి, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌ రాజుకు రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు గణతంత్ర దినోత్సవంలో బంగారం పతకం అందజేస్తున్నామని కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. జన్మభూమి-మా ఊరు నిర్వహణలో వీరులపాడు మండలంలో గ్రామ సభలకు ఎక్కువ మంది ప్రజలు హజరు కావడంతో పాటు జన్మభూమి నిర్దేశించిన 15 అంశాలు సమర్థంగా నిర్వహించినందుకు వీరులపాడు మండలం వరుసగా మూడుసార్లు రాష్ట్రస్థాయిలో మొదటి శ్రేణిలో నిలిచిందని బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి చంద్రశేఖర్‌రాజుకు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులకు గురు వారం అభినందనలు తెలియ జేశారు. 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.